బంపర్ ఆఫర్.. తినండి లక్ష గెలవండి?

praveen
హాయిగా కూర్చుని తిని లక్ష రూపాయలు సంపాదించే అవకాశం ఉంటే ఎవరు కాదంటారూ చెప్పండి. ఏంటండీ నిజమే చెబుతున్నారా కూర్చుని తింటే లక్ష రూపాయలు సంపాదించవచ్చా.. ఇలాంటి ఆఫర్ నిజంగానే ఉందా అని ఆత్రుత పడిపోతున్నారు కదా.. అంత ఆత్రుత పడకండి.. ఎందుకంటే పొరపాటున కమిట్ అయ్యారు అంటే చాలు ఆ తర్వాత బాధ పడాల్సి ఉంటుంది. ఎందుకు అంటారా.. ఇక నావల్ల కాదు మేము తినలేము అనేంతలా తినాల్సి ఉంటుంది. ఇటీవలే భోజన ప్రియుల కోసం ఒక రెస్టారెంట్  వారు చాలెంజ్ ప్లాన్ చేసారూ.Your browser does not support HTML5 video.
 పంచభక్ష పరమాన్నాలు అంటారు కదా అచ్చం అలాంటిదే తీసుకొచ్చి ముందు పెడతారు. ఇక ఆ టేబుల్ మీద ఉన్న అన్ని ఐటమ్స్ తినేయాలి. ఒక్కటి కూడా లేకుండా తిన్నారు అంటే లక్ష రూపాయల చెక్కు మీ చేతిలో పెట్టేస్తారు.ఇక దీని పేరు బాహుబలి తాలి పిలుస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన ఒక రెస్టారెంట్ ఇక ఇలాంటి ఆఫర్ ప్రకటించింది. రెస్టారెంట్లో వడ్డించే బాహుబలి తాలి సింగిల్ సిట్టింగ్లో తినగలిగితే కస్టమర్లకు లక్ష రూపాయలు బహుమతి అంటూ ప్రకటించడంతో ఒక్కసారిగా ఈ రెస్టారెంట్ ఫేమస్ అయ్యింది.Your browser does not support HTML5 video.
 కూర్చుని తిని లక్ష రూపాయలు సంపాదించాలని ఉందా అయితే నాయుడు గారి కుండ బిర్యాని కి రండి అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ  వైరల్ అయిపోతుంది. ఇక ఈ వీడియోలో పెద్ద తాలి లో వండిన వంటకాలు, కుండ బిర్యాని అన్నం తో పాటు రకరకాల కూరలు స్వీట్స్ నూడిల్స్ అన్ని రకాల వంటకాలు ఉన్నాయి. అయితే తీరిగ్గా కూర్చుని గంటా రెండు గంటలు ఈ మొత్తాన్ని లాగించేయొచ్చు అనే ఆలోచన మీ మనసులో వచ్చే ఉంటుంది. కానీ అలా అస్సలు కుదరదు  కేవలం 30 నిమిషాల్లోనే ఇదంతా ఆరగించాలి. అయితే మా వల్ల కాదు అని అనుకుంటున్న సమయంలో ఒక యువకుడు మాత్రం నిజంగానే బాహుబలిలా ముందుకు వచ్చి బాహుబలి తాలిని ఖాళీ చేసి లక్ష రూపాయలు గెలుచుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: