రేపు సూర్య గ్రహణం..ఎవరు ఎలాంటి పని చేయకూడదంటే..!

Divya
 మన హిందూ సంప్రదాయాలలో.. సూర్యగ్రహానికి, చంద్ర గ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. అందుచేతనే అవి ఏర్పడే సమయంలో ఎవరు బయట ఎక్కువగా ఉండరు. డిసెంబర్ 4వ తేదీన ఏర్పడునటువంటి సూర్యగ్రహణం ఎలాంటిది , ఎవరు ఎలాంటి పనులు చేయకూడదో వాటి గురించి ఇప్పుడు చూద్దాం.
తాజాగా డిసెంబర్ 4వ తేదీన ఏర్పడే సూర్య గ్రహణం.. దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికాలో వంటి ప్రాంతాలలో బాగా కనిపిస్తుంది. అయితే కొంతమంది పండితులు తెలిపిన ప్రకారం రేపు ఉదయం 10:59 నిమిషాలకు ఆరంభమై.. మధ్యాహ్నం 3:07 నిమిషాలకు సూర్యగ్రహణం ముగుస్తుందని తెలియజేశారు. ఈ సంవత్సరంలో ఇదే చివరి సూర్య గ్రహణం అని తెలియజేశారు. అయితే ఇది మన భారతదేశంలో అక్కడక్కడా కనిపిస్తుంది.. అంతగా ప్రభావం చూపదని తెలియజేశారు. అయినా కాని వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని పండితులు సూచించారు.
1). గర్భవతులు:
సూర్య గ్రహణం వచ్చే 12 గంటల ముందు వరకు మీరు ఆహారం తీసుకోకూడదని పండితులు తెలియజేస్తున్నారు. చిన్నపిల్లలు, గర్భవతులు, వృద్ధులు సమయానికి తిని, బయట తిరగకూడదని తెలియజేశారు. ముఖ్యంగా గర్భవతులు వెళితే పుట్టే శిశువు అంగవైకల్యంతో పుట్టే ప్రమాదం ఉందని జ్యోతిష్యులు తెలియజేశారు.

సాధారణ ప్రజలు బయట వైపుల మలమూత్రం, మలవిసర్జన, ఎక్కడపడితే అక్కడ నీరు తాగడం వంటివి చేయకూడదట. ముఖ్యంగా ఇంట్లోని ఆడవారు జుట్టు దువ్వడం, లైంగిక చర్యలు పాల్గొనడం వంటివి చేయకూడదని.. కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు.
సూర్య గ్రహణం ముగిసిన తరువాత.. ప్రతి ఒక్కరు స్నానం చేసి.. ఆహారాన్ని తాజాగా వండుకొని తినాలట. ముఖ్యంగా గ్రహణానికి ముందు ఆహారాన్ని వండి నట్లయితే వాటిని తినకూడదు అని పండితులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా తినేటప్పుడు తులసి ఆకులను వాటి పైన చల్లుకొని తినాలని జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు.
ఇక ఈ ఏడాది ఇదే చివరి సూర్యగ్రహణం కాబట్టి.. మన భారతదేశంలో దీని ప్రభావం చాలా అరుదు గా ఉంటుందని తెలియజేశారు పండితులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: