మరొకసారి బాదుడు మొదలుపెట్టిన ATM చార్జెస్..

Divya
బ్యాంకు లావాదేవీలు విషయంపై కొన్ని బ్యాంకులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మనం డబ్బులను ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకుంటూనే ఉంటాము. అయితే వాటిని లిమిట్ కన్నా ఎక్కువగా తీసుకున్నట్లయితే చార్జీలు మోత మొదలు పెడుతున్నాయి బ్యాంకులు.. అయితే సొంత బ్యాంక్ ఎటిఎం లోనే కాకుండా.. ఇతర బ్యాంకు ఏటీఎంలో కూడా మని తీసుకున్నట్లయితే ఇక మీద బాదుడే అని అర్థం అవుతోంది.

అయితే ఇది వరకే విత్డ్రా పై కొన్ని కండీషన్స్ మీద కొన్ని   బ్యాంకులు చార్జీలు పెంచనున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని బ్యాంకులు సైతం ఇతర ఏటీఎం బ్యాంకులను ఉచితంగా ఇవ్వకుండా.. వాటిపై కూడా చార్జీలు విధించేందుకు వచ్చే ఏడాది జనవరి నుండి కొన్ని రూల్స్ ను అమలులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటుగా జనవరి ఒకటో తారీకు నుంచి వీటన్నిటిని పెంచడం జరుగుతోందని కొన్ని ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్  తెలిపింది.
లిమిట్ కు మించి మనీ విత్ డ్రా చేసిన, డిపాజిట్ చేసేటటువంటి లావాదేవీల పైన కూడా ఒక్కో ట్రాన్సాక్షన్ కు..21 రూపాయలతో పాటుగా జీఎస్టీ ని కూడా వసూలు చేయనున్నట్లు సమాచారం. ఇది యాక్సిస్ బ్యాంకు కస్టమర్ లు, ఇతర బ్యాంకు కస్టమర్లు ఈ విషయాన్ని గమనించాలని తెలిపింది. ఇక మీదట జరిగేటటువంటి ప్రతి లావాదేవీల మీద..15 రూపాయల నుంచి 17 రూపాయల వరకు పెంచ బోతున్నాం తెలుపుతోంది.

అయితే ఆర్బీఐ మాత్రం లావాదేవీలకు 5 నుంచి 6 రూపాయలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చినట్లుగా తెలియజేసింది. ఈ కండిషన్ ఈ ఏడాది ఆగస్టులో నే ప్రారంభమైంది. ఏ బ్యాంకు ఖాతా కలిగిన వారైనా.. వారి బ్యాంకు కు ఎటిఎం ఏం నుంచి కేవలం మనీ విత్ డ్రా చేసుకోవాలంటే ఉచితంగా ఐదు లావాదేవీలు మాత్రమే ఉంటాయి. ఇక ఇతర ప్రాంతాల్లో సైతం వారి వారి పరిధిని బట్టి ఉంటాయి. అందుచేతనే ఇకమీదట ఎక్కువ సార్లు ట్రాన్సాక్షన్ జరిపితే చార్జీలు వసూలు చేస్తున్నామని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: