విచిత్రమైన వ్యాధి... మాట్లాడుతూ మాట్లాడుతూనే ఇలా...!

Vimalatha
ఇలాంటి వింతలు ప్రపంచంలో తరచుగా జరుగుతూనే ఉంటాయి. అయితే అందులో కొన్నింటిని నమ్మడం చాలా కష్టం. ఇప్పుడు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో ఒక మహిళ వరుసగా రెండు వారాల పాటు కోమాలో ఉండి, కోమా నుంచి బయటకు వచ్చేసరికి ఆమె మాట్లాడే విధానం మారిపోవడం. ఈ విషయం ఇటీవలి కాలంలోనే జరిగింది. ఆ మహిళ వయస్సు 24 సంవత్సరాలు. ఆమె పేరు సమ్మర్ డియాజ్. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ మహిళ తన జీవితంలో ఎప్పుడూ న్యూజిలాండ్‌కు వెళ్లలేదుకానీ ఆమె కోమా నుండి లేవగానే కివీ యాసలో మాట్లాడటం ప్రారంభించింది. సమాచారం ప్రకారం ఈ స్త్రీకి ఒక వింత వ్యాధి ఉంది. దాని కారణంగా ఆమె లాంగ్వేజ్ అకస్మాత్తుగా మారిపోయింది.
ఈ వ్యాధి పేరు ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్. దీనిని యాక్సెంట్ చేంజ్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఈ వింత వ్యాధిలో వ్యక్తుల భాష అకస్మాత్తుగా మారుతుంది. ఇది ఎలా సాధ్యమవుతుందని, ఆ పేషెంట్ మాట్లాడిన తీరు విని ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. వాస్తవానికి సాధారణంగా వివిధ దేశాల ప్రజలు మాట్లాడే విధానం, ఉచ్చారణ భిన్నంగా ఉంటుంది. అమెరికాకు చెందిన వ్యక్తి ఇంగ్లీషులో వేరే విధంగా మాట్లాడినట్లు, భారతీయ వ్యక్తి ఇంగ్లీష్ మాట్లాడే విధానం భిన్నంగా ఉంటుంది. ఈ రెండు ప్రదేశాలకు చెందిన వ్యక్తులు ఒకరి భాషను ఇంకొకరు నేర్చుకోవడానికి నెలలు లేదా సంవత్సరాలు పడుతుంది. కానీ విదేశీ యాస సిండ్రోమ్ ఉన్న వ్యక్తులు సులభంగా మరొక యాసలో మాట్లాడగలరు.
ఇది అరుదైన సిండ్రోమ్ అని, మొదటి కేసు 1907 సంవత్సరంలో వచ్చిందని తెలుస్తోంది. మెదడు ఎడమ వైపున గాయం కారణంగా ఈ వ్యాధి సంభవించవచ్చు, ఎందుకంటే శరీరంలోని ఈ భాగం ప్రసంగంలో సహాయపడుతుంది. అకస్మాత్తుగా మెదడుకు చేరే రక్త ప్రవాహం ఆగిపోయి, మెదడులోని నరాలు చిట్లితే ఈ వ్యాధి సంభవించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: