Viral Video : ప్రిన్సిపాల్ పోస్ట్ కోసం కొట్టుకుంటున్న టీచర్లు..

Purushottham Vinay
ప్రిన్సిపాల్ పోస్ట్ అనేది ఒక స్కూల్ లేదా కాలేజీకే కాదు సమాజంలో కూడా మంచి గుర్తింపు పొందింది. మంచి జీతం ఇంకా అంతకంటే మంచి గుర్తింపు వున్న పోస్ట్ కావటంతో ప్రతి టీచర్ కూడా తమ జీవితకాలంలో ప్రిన్సిపాల్ కావాలని కోరుకుంటారు.ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలో స్కూల్ ప్రిన్సిపాల్ పోస్ట్ కోసం ఇద్దరు వ్యక్తులు తెగ గొడవ పడుతున్నారు. ఇక ఈ సంఘటన బుధవారం మోతిహరి పట్టణంలో రాష్ట్ర విద్యా శాఖ కార్యాలయంలో జరిగింది. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.ఇక స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కూడా అదే అడగడంతో ఇద్దరూ పత్రాలను సమర్పించడానికి విద్యా శాఖ కార్యాలయానికి వెళ్లడంతో అక్కడ పరిస్థితి హింసాత్మకంగా మారింది. 

ఈ ఇద్దరు వ్యక్తులు, ప్రత్యర్థి టీచర్ భర్త అయిన శివశంకర్ గిరి ఇంకా రింకి కుమారి, పాఠశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ఎవరు ఎక్కువ సీనియర్ అలాగే అర్హులు అనే విషయంలో వాగ్వాదానికి దిగడం జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు మాటలతో దూషించడం మొదలుపెట్టారు ఇంకా శారీరక గొడవకు దిగారు, ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వీడియోలో, రింకి భర్త శివశంకర్‌ను "గిలెటిన్ చౌక్" లేదా హెడ్‌లాక్‌లో పట్టుకుని పోరాటాన్ని రెజ్లింగ్ సెషన్‌గా చేస్తున్నట్లు చూడవచ్చు. ఇద్దరు కాకుండా, మరో ముగ్గురు నుండి నలుగురు వ్యక్తులు కూడా పోరాటాన్ని విరమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.గిరి ఇంకా కుమారి గత మూడు నెలలుగా అదర్‌పూర్‌లోని ఒక ప్రాథమిక పాఠశాలలో ప్రిన్సిపాల్ పోస్టును పొందాలని చూస్తున్నారు.ఇక ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజన్స్ అయితే ఈ రకంగా కొట్టుకుంటున్న ఈ ఇద్దరు టీచర్లు ఈ పోస్ట్ కి అనర్హులు అని కామెంట్స్ చేస్తున్నారు.ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు చూసేయండి.మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.


https://twitter.com/aanirbanbh/status/1448638831587049478?t=3XV1g1s3fhOio2XiTFlShQ&s=19

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: