స్కూల్ కు వెళ్లి వస్తానమ్మ అంటూ...తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన విద్యార్థి..!

Divya
కరోనా తగ్గుముఖం పట్టడంతో నెమ్మదిగా స్కూలు ప్రారంభించడం మొదలుపెట్టారు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలు.అలా ఒక బాలుడుచదువు కోవడమే శాపంగా మారింది ఒక బాలుడికి. చదువుకుంటానంటు స్కూల్ కి వెళుతున్న సమయంలో మరణించడం జరిగింది.ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని అనంతసాగరం అనే మండలంలోని కామిరెడ్డి పాడు గ్రామంలో sc ప్రాథమిక స్కూల్లో చదువుతున్న ఒక విద్యార్థి మృతి చెందిన సంఘటన గురువారం ఈ విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఆ గ్రామంలో ఉన్నటువంటి సత్యాల,సామ్ ప్రసాద్ అనే దంపతులకు.. అభిషేకం అనే 11 సంవత్సరాల కుర్రోడు ఈనాడు.
ఇక ఈ బాలుడుతో పాటు ఆ దంపతులకు మరో ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అభిషేక్ అక్కడున్న స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువు కొనసాగిస్తున్నాడు. ఇక గురువారం ఉదయం తన ఇంటి నుంచి పాఠశాలలకు బయలుదేరుతున్నాను అంటూ స్కూల్ కి వెళ్ళాడు. అలా మధ్యాహ్న సమయంలో పాఠశాలలోని ఉండేటువంటి మరుగుదొడ్ల లోకి వెళ్ళాడు. ఇక ఇదే తంతులు అక్కడ అమరు దొడ్లో ఉన్నటువంటి తేలు ఎడమచేతికి కాటు వేసింది.
తేలు కాటు వేసిన సమాచారాన్ని ఉపాధ్యాయులకు, తమ కుటుంబ సభ్యులకు తెలియజేశాడు అభిషేక్. ఆ తర్వాత వారు వారికి దగ్గరలో ఉంటున్న ఒక ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు. కానీ అప్పటికి ఆ బాలుడు పరిస్థితి విషయంగా మారింది. అందుకోసం మెరుగైన వైద్యం కోసం నెల్లూరు గవర్నమెంట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించారు. ఇక ఈ దంపతులకు ఒకే ఒక కుమారుడు కావడంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న అభిషేక్ మరణించడంతో ఆ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా శోక సముద్రంలోకి వెళ్ళిపోయారు. దీంతో ఆ కుటుంబం అంతా బోరున ఏడుస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి స్కూల్లో ఉండేటువంటి మరుగుదొడ్ల పై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: