వైరల్:వరల్డ్ లోనే అతిపెద్ద జాతీయ జెండా ఇదే..!

Divya
ఈ రోజున మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా.. ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు కార్యాలయాలలో జాతీయ జెండాను ఎగరవేయడం మనం చూస్తూనే ఉంటాము. ఇక ఈ రోజున మంచు కొండల పర్వతాల మధ్య ఎగిరిన మువ్వన్నెల జెండా ఇప్పుడు ప్రపంచ రికార్డును సృష్టిస్తోంది. అది ఎక్కడ ఏ అంటే ఏమిటో తెలుసుకుందాం.

లడక్లోని లేహ్ లో హిమాలయ పర్వతాల మధ్య ప్రపంచంలోనే అతిపెద్ద జెండాలో ఎగరవేశారు. అక్కడ పనిచేసే ఎటువంటి లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ R.K.MADHUR ఈ జెండాను ఆవిష్కరించారు. ఇదే క్రమంలో ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ తో పాటు మరికొంత ఆర్మీ అధికారులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీజీ, ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పుట్టినరోజు సందర్భంగా వారిరువురికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ.. నివాళులు అర్పించారు.
ఢిల్లీలోని రాజ్ఘాట్, విజయ్ ఘాట్ లలో గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి ల సమాధులకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇక మహాత్మాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి ఎంచుకున్న మార్గాలు ప్రపంచం మొత్తానికి గొప్ప శక్తిని ఇస్తున్నాయని నరేంద్రమోడీ తెలియజేశారు. ఇక అంతే కాకుండా వీరిద్దరుతో పాటు మరెందరో స్వాతంత్ర సమరయోధుల లో పాల్గొన్నారు  అందరి కష్ట ఫలితమే.. మనకు స్వాతంత్రం వచ్చింది అని తెలియజేశారు.
ఇక అలాగే లాల్ బహదూర్ శాస్త్రి జీవితం ప్రతి ఒక్క భారతీయునికి చాలా స్ఫూర్తిదాయకమని ప్రధాన మంత్రి తెలియజేశాడు. ఇక నరేంద్ర మోడీ తో పాటుగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, అమ్మ ఆద్మీ పార్టీ చీఫ్, సహో కొంత మంది ప్రముఖులు కూడా గాంధీజీకి, లాల్ బహదూర్ శాస్త్రి కి నివాళులు అర్పించారు. ఇక లడక్ లో ఎగరవేసిన జెండా వీడియో ఇప్పుడు ఎక్కువగా వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: