ఆ వయస్సులో పెళ్లి చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?

Purushottham Vinay
ఇక ఒక వయసుకు రాగానే ఇంట్లో పెద్ద వాళ్ళు పెళ్ళి చేసేయాలని యువతీ యువకులను బాగా ఫోర్స్ చేసి తెగ పోరు పెడుతుంటారు. ఇక ఆడవాళ్ళనైతే 20ఏళ్ళ నిండగానే పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అని అందరూ అడుగుతూనే ఉంటారు.ఐతే ఇప్పుడు పరిస్థితులు అనేవి చాలా మారిపోయాయి. యువతి యువకులు అందరూ కూడా కేవలం ఒక వయసుకు వచ్చాక మాత్రమే పెళ్ళి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.ఇక ప్రస్తుతం వున్న జెనరేషన్ లో ఆడవాళ్ళైకైనా ఇంకా మగవాళ్ళైకైనా పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలనేది వారి ఇష్టానికే వదిలేస్తున్నారు పెద్దలు.ఇక చాలా మంది కూడా 30 ఏళ్ళు దాకా సింగిల్ గా పెళ్లి చేసుకోకుండా ఉంటారు. కొంతమంది తమ జీవితం అయిపోయిందేమో అని చాలా భయపడతారు. కాని భయపడాల్సిన పనేమీ లేదు.
30 ఏళ్ళు దాటినా సింగిల్ గా ఉంటే చింతించాల్సిన పని లేదు. ఎందుకంటే ఎన్నో లాభాలు వున్నాయి. ఇక అవేంటో తెలుసుకోండి.30 సంవత్సరాలు వచ్చాక జీవితంలో ఆలోచనలు అనేవి చాలా మారతాయి. జీవితం పట్ల ఒకరకమైన దృక్పథం అనేది ఏర్పడుతుంది. అవతలి వారిని అర్థం చేసుకునే తత్వం అనేది బాగా పెరుగుతుంది. కాబట్టి మీ జీవితంలో మంచి భాగస్వామి వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది.ఇక 20ల్లో ఉండగా రిలేషన్ షిప్ లో దిగితే కుటుంబాన్ని ఇంకా స్నేహితులను పెద్దగా పట్టించుకోకుండా ఉంటారు. ఇక అదే 30ఏళ్ళ వరకు సింగిల్ గా ఉంటే, స్నేహితులతో మంచి సంబంధాలు అనేవి పెరుగుతాయి.అలాగే తల్లిదండ్రుల పట్ల కూడా అపారమైన ప్రేమ అనేది పెరుగుతుంది.ఇక 20ల్లో ఉన్నప్పుడు ఏది ప్రేమో అలాగే ఏది కామమో తెలిసే అవకాశం అనేది చాలా మందికి ఉండదు. చాలాసార్లు ఆ ఏజీలో కామాన్నే ప్రేమ అనుకునే అవకాశం కూడా ఉంది. అదే 30ల్లో అయితే ఆ తేడా అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: