శ్రీజారెడ్డి : సేవే లక్ష్యంగా.. పిల్లల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా..?

Divya

శ్రీజా రెడ్డి సరిపల్లి.. ఈమె ఎవరు? పిల్లల సమస్యలను ఈమె ఎందుకు పరిష్కరిస్తోంది ? ఏమైనా చిన్న పిల్లల డాక్టరా? లేక మరి ఎవరు? అని అందరి మదిలోనూ ఇలాంటి ప్రశ్నలే మొదలవుతుంటాయి. ఇలాంటి ఎన్నో సమాధానం లేని ప్రశ్నలకు ఒకటే సమాధానం శ్రీజా రెడ్డి. ఈమె ఎవరో కాదు 14 టెక్ సంస్థల అధినేత కోటిరెడ్డి సరిపల్లి సతీమణి శ్రీజా రెడ్డి సరిపల్లి. శ్రీజా రెడ్డి సరిపల్లి ప్రస్తుతం సేవే లక్ష్యంగా, పిల్లల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పెట్టుకుని , సమాజ సేవకై తన వంతు కృషి చేస్తోంది. అయితే ఈమె చేస్తున్న సేవ ఏమిటి ? దాని వివరాలు ఏమిటి ? అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.
కోటిరెడ్డి, శ్రీజా రెడ్డి దంపతులకు ఒక పుత్రుడు జన్మించాడు. పేరు సంహిత్. ఆ అబ్బాయి పుట్టిన ఒకటిన్నర సంవత్సరానికి వినికిడి లోపం ఉందని వైద్యులు తేల్చి చెప్పారు. ఇక ఈ వార్త విన్న తల్లిదండ్రుల గుండె పగిలినట్టు అయింది. ఆటిజం అంటే బుద్ధిమాంద్యత అని అర్థం. అంటే శరీరంలోని అన్ని అవయవాలు బాగా పని చేస్తున్నప్పటికీ వారి బుద్ధి మాత్రం వారి ఆధీనంలో ఉండకపోవడం. అంటే ఈ ఆటిజం సమస్య అందరిలోనూ ఒకే లాగా ఉంటుందని చెప్పలేము. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి ఒక్కో విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ సంహిత్ కి మాత్రం వినికిడి లోపం వుందని తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో స్పెషలిస్ట్ లను కలిశారు. దాదాపు రెండు మూడు సంవత్సరాలు నిర్విరామంగా కష్టపడి ఎంతో వేదనను అనుభవించారు. నిద్ర లేని రాత్రులు ఎన్నో చూశారు. ఇక అలా ఆ ఆవేదన నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే పినాకిల్ బ్లూమ్స్.. ఆమె పడ్డ కష్టం మరే తల్లి పడకూడదన్న ఒకే ఒక్క లక్ష్యంతో ఈ పినాకిల్ బ్లూమ్స్ సంస్ధ ను ఏర్పాటు చేశారు.
2017 లో నాలుగు కోట్ల వ్యయంతో పినాకిల్ బ్లూమ్స్ అనే సంస్థ ను హైదరాబాద్ లోని సుచిత్ర లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా కొన్ని వందల మంది చిన్నారులకు అవసరమయ్యే ఆక్యుపేష‌న‌ల్ థెర‌పీ, ఫ్యామిలీ కౌన్సెలింగ్‌, ఎర్లీ ఇంట‌ర్ వెన్ష‌న్‌, ప్లే అండ్ స్ట‌డీ గ్రూప్స్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెర‌పీల‌ను ఏర్పాటు చేశారు. ఇలా అన్ని ర‌కాల వైద్య విద్యలను ఒకేచోట అందించేందుకు కృషి చేశారు. దీంతో ఆటిజంతో ఇబ్బంది ప‌డుతున్న చిన్నారుల‌కు ఓ దారి క‌నిపించిన‌ట్ట‌యింది.
=
ఆటిజం సమస్య వున్న పిల్లల్లో అంటే మూడు మాసాల వయసు నుంచి రెండున్నర సంవత్సరాల వయసు వరకు కావలసిన అన్ని చికిత్సలను ఉచితంగా అందిస్తూ ,చావుకు దగ్గర వున్న పిల్లలకు మృత్యుంజయ గా నిలుస్తోంది శ్రీజా రెడ్డి సరిపల్లి. కేవలం చిన్న పిల్లలకే కాకుండా టీనేజ్ వయసులో ఉన్న పిల్లలకు కూడా ఉచితంగా సేవలను అందిస్తోంది. ఇక ఇందులో వంద మందికి పైగా స్పెషలిస్ట్ డాక్టర్ లు పనిచేస్తున్నారు.

ఇక ఎంతో మంది చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ , వారి తల్లిదండ్రుల మోములో చిరునవ్వు చూసి ఆనందించి, అదే తన రాబడి అని చెబుతోంది శ్రీజా రెడ్డి సరిపల్లి. ఇంత మహనీయత మనసు కలిగిన శ్రీజా రెడ్డి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఇలాంటి వ్యక్తులు ఇంకా మన మధ్య ఉన్నారు అంటే అది మనం గర్వించదగ్గ విషయం. ఈమె తన సేవలను కేవలం ఈ రెండు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేయకుండా , ఇతర రాష్ట్రాలు అలాగే దేశాల నుంచి కూడా తల్లిదండ్రులు, వారి పిల్లలకు కావలసిన చికిత్సలను అందించడం కోసం ఈ సంస్థలను వారికి చేరువలో ఏర్పాటు చేశారు.
" >

" >

" >

" >



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: