Ola : షాకింగ్ డెసిషన్.. వాటికి గుడ్ బై!

ప్రముఖ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ సంస్థ అయిన ఓలా (Ola) సంచలన నిర్ణయం తీసుకుంది.ఇంకా అలాగే కంపెనీకి చెందిన పాత కార్ల బిజినెస్‌ ప్లాట్‌ఫామ్ ఓలా కార్స్‌తో (Ola Cars) పాటు క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన ఓలా డ్యాష్ (Ola Dash)ను మూసివేసినట్లు కూడా తాజాగా ప్రకటించింది. ఇక ఇండియాలో నిత్యావసర సరుకులను ఫాస్ట్‌ డెలివరీ చేసే సంస్థల మార్కెట్ గ్రోత్ పెరుగుతున్న నేపథ్యంలో ఓలా డ్యాష్‌ను కంపెనీ క్లోజ్ చేసింది. ఎలక్ట్రిక్ టూవీలర్ ఇంకా కార్ల బిజినెస్‌పై దృష్టి పెట్టేందుకే ఓలా ఈ రెండు వ్యాపారాలను బంద్ చేసింది. ఓలా కంపెనీ దాని యూజ్డ్ వెహికల్ బిజినెస్ ఓలా కార్స్‌ను ప్రారంభించిన ఏడాది సమయంలోనే క్లోజ్ చేయడం గమనార్హం. ఇప్పటివరకు కూడా ఓలా కేఫ్, ఫుడ్ పాండా, ఓలా ఫుడ్స్, ఇప్పుడు ఓలా డ్యాష్‌ విభాగాలను కంపెనీ మూసివేసింది.ఈ నిర్ణయం తీసుకునే ముందు ప్రాధాన్యతలను ఓలా సంస్థ తిరిగి పరిశీలించిందని..ఇక ఆ తరువాత తన క్విక్ కామర్స్ బిజినెస్ ఓలా డ్యాష్‌ని మూసివేయాలని నిర్ణయించుకుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎలక్ట్రిక్ మార్కెట్ వ్యూహాన్ని బలోపేతం చేయడంపై మరింత దృష్టి పెట్టడానికి తన ఓలా కార్ల బిజినెస్‌ను కూడా చేంజ్ చేస్తుందని ఓలా కంపెనీ ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఓలా కార్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ ఇంకా కేపబిలిటీస్‌ అనేవి ఓలా ఎలక్ట్రిక్ సేల్స్ & సర్వీస్ నెట్‌వర్క్‌ను వృద్ధి చేసేందుకు ఉపయోగించనున్నామని కంపెనీ వివరించింది.


ఈ కంపెనీ ఇప్పుడు దాని ఎలక్ట్రిక్ కారు ఇంకా సెల్ మాన్యుఫ్యాక్చరింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్‌ల్లో అధికంగా పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే దేశీయ క్విక్ కామర్స్ మార్కెట్ 2025 నాటికి 15 రెట్లు వృద్ధిని నమోదు చేయనున్న సమయంలో ఓలా డ్యాష్‌ని ఓలా క్లోజ్ చేసింది. ఇక ఆ సమయానికి మార్కెట్ 5.5 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుంది.అలాగే ఓలా ఎలక్ట్రిక్ 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో రూ.500 కోట్ల రెవిన్యూకి మించి సంపాదించింది.ఇక ఈ స్థాయిలో వ్యాపారం పుంజుకుంది కాబట్టే కేవలం ఓలా ఎలక్ట్రిక్ వాహనాలపై మాత్రమే పూర్తిగా దృష్టి పెట్టేందుకు తన ఇతర వ్యాపారాలన్నీ కూడా నిలిపి వేస్తోంది. ఇంకా అలాగే మరోవైపు ఓలా తన ద్విచక్ర వాహన పోర్ట్‌ఫోలియోను కూడా పెంచే దిశలో ప్లాన్స్ వేస్తోంది. అలాగే ఇందులో భాగంగా త్వరలోనే రెండో ఈవీ స్కూటర్‌ను విడుదల చేయడానికి ప్లాన్స్ సిద్ధం చేస్తోంది.అయితే ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొద్ది రోజుల క్రితం అగ్ని ప్రమాదాలకు గురయ్యాయి. దీంతో ఈ-స్కూటర్లలోని ఫాల్టీ బ్యాటరీలను చెక్ చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఓకినోవా ఆటోటెక్, ప్యూర్ ఈవీ ఇంకా జితేంద్ర ఎలక్ట్రిక్ వెహికల్స్, బూమ్ మోటార్స్ వంటి సంస్థల స్కూటర్ల తయారీపై కూడా ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది.ఇంకా అలాగే కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (BIS) ఇంకా ఈవీ బ్యాటరీల తయారీపై కఠినమైన నియంత్రణను ఉంచే ప్రయత్నంలో ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్‌ పర్ఫామెన్స్ స్టాండర్డ్స్‌ను ప్రచురించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: