బుల్లిపిట్ట: రూ.45 లక్షల రూపాయల ఖరీదైన దిండు.. ఇందులో విశేషం ఏమిటంటే..!!

Divya
మనం మంచిగా నిద్ర పోవాలి అంటే ముఖ్యంగా దిండు సుఖవంతమైనది అని చెప్పవచ్చు.. దీంతో మనం మరుసటి రోజు కూడా ఎంతో ప్రశాంతంగా ఉండవచ్చు. నిద్ర పోవడానికి మంచి దిండు ఉపయోగించని వ్యక్తులు పలు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా నిద్రలేకపోవడం వల్ల దీని ప్రభావం ఆరోగ్యంపైన కూడా చూపుతోంది. అయితే దిండ్లు తయారీలో మన పూర్వీకుల నుంచి ఇప్పటివరకు పత్తిని ఉపయోగిస్తున్నారు కానీ ఆధునిక యుగంలో పలు మార్పులు రావడం వల్ల దిండు రూపురేఖలు కూడా మారిపోయాయి. ప్రస్తుతం ఖరీదైన దిండ్లు పలు రకాలుగా మార్కెట్లోకి వస్తున్నాయి . అయితే ఇప్పుడు అత్యంత ఖరీదైన ఒక దిండు గురించి మనం తెలుసుకుందాం.
నెదర్లాండ్ కు  చెందిన ఫిజియోథెరపీ ఖరీదైన దిండు ను తయారు చేయడం జరిగింది. నిద్ర లేమి సమస్య లను ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఈ దిండు పై ప్రశాంతంగా నిద్ర పోవచ్చు అని..అందుకే  దీనిని సృష్టించినట్లు గా తెలియజేశారు. అయితే ఈ దిండు ధర మాత్రం చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. ఇది దిండు ఖరీదుకు బదులుగా మీరు ఒక లగ్జరీ కారును కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ దిండు తయారు చేయడానికి దాదాపుగా 15 సంవత్సరాలు పట్టింది ఎందుకంటే దీని తయారీ కోసం ఫిజియోథెరపిస్ట్ చాలా పరిశోధనలు చేయడం జరిగిందట.

అయితే ఈ దిండు ప్రత్యేకతలు ఏమిటంటే ఈ దిండు ధర రూ.45 లక్షల రూపాయలు. మన ఇండియన్ లో ఈ దిండు నీలమణి బంగారు వజ్రం తో తయారు చేస్తారు. అందుచేతనే ఇది అంత ఖరీదైనది. దిండు లోపల ఉపయోగించే పత్తి రోబోటిక్ మిల్లింగ్ మిషన్. అంతేకాకుండా ఈ దిండు కి నాలుగు వజ్రాల ను కూడా అమర్చడం జరుగుతుంది .అదనపు ఆకర్షణీయంగా నీలమణి కూడా ఉంటుంది అని తెలిపారు. ఈ దిండును బ్రాండెడ్ బాక్సులలో ఉంచుతారు. ఈ దిండు వల్ల సుఖమైన నిద్ర పడుతుందో లేదో కానీ.. ఇది దిండు ను తీసుకోవాలనే ఆలోచన మాత్రం నిద్ర లేకుండా చేస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: