బుల్లిపిట్ట: ఇక మీదట వాట్సాప్ లో ఆ సమస్యకు చెక్.. సరికొత్త ఫీచర్..!!

Divya
ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ లో వాట్సాప్ కూడా ప్రథమ స్థానంలో ఉందని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో తీసుకు వస్తుంది కాబట్టి ఈ యాప్ కి ఇంత క్రేజ్ ఉన్నదని చెప్పవచ్చు. యూజర్ల ఆసక్తి అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను తీసుకు వస్తూ ఉంటుంది ఈ సంస్థ. ప్రత్యర్థి సంస్థల నుంచి వస్తున్న పోటీ నీ తట్టుకునే ఈ క్రమంలో ఇటీవల వాట్సాప్ మరి కొన్ని ఫీచర్లను తీసుకువచ్చింది. ఇక ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

ఇలాంటి సమయంలోనే తాజాగా మరొక ఆకట్టుకునే ఫీచర్ ను వాట్సాప్ మనముందుకు తీసుకువచ్చింది. వాట్స్అప్ ద్వారా సమాచార మార్పిడి ని చాలా సులభంగా మార్చుకోవచ్చు. అదే స్థాయిలో వ్యక్తిగత జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా వాట్సాప్ లో వచ్చే నోటిఫికేషన్ చాలా సమస్యగా మారుతోంది. లెక్కలేనన్ని గ్రూపులు ఉండడం వల్ల నిత్యం ఏదో ఒక గ్రూప్ నుండి మెసేజ్ అలర్ట్ వస్తూనే ఉంటాయి. దీంతో పదే పదే మనం మొబైల్ ను  చూడవలసి వస్తుంది ఇది ఒక పెద్ద సమస్యగా మారుతోంది యూజర్లకు. అందుచేతనే ఈ సమస్యకు త్వరలోనే చెక్ పెట్టడానికి వాట్సాప్ మరొక సరికొత్త ఫీచర్ తీసుకువస్తోంది.

బీటా అప్డేట్ లో భాగంగా డు నాట్ డిస్టర్బ్ అనే ఫీచర్ ను తీసుకువచ్చే పనిలో ఉన్నది. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లకు ఇన్కమింగ్ కాల్స్, మెసేజ్ నోటిఫికేషన్ వంటివి మనం బ్లాక్ చేసుకొనే అవకాశం కలదు. వాట్సాప్ బీటా ఇన్ఫో లో ఈ వివరాలను తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైనా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్రలో ఉన్నప్పుడు ఎలాంటి నోటిఫికేషన్ రాకుండా సెట్ చేసుకోవచ్చు అట. అంతేకాకుండా ఈ ఫీచర్ కి టైమింగ్ సెట్ చేసుకునే అవకాశం కూడా కలదు ఎంచుకున్న సమయంలో ఎలాంటి అలర్ట్ రాకుండా సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ IOS -15 లో మాత్రమే కలదు. రాబోయే రోజుల్లో ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటు లోకి రాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: