మీరు యాపిల్ ఫోన్ వాడుతున్నారా.. అయితే ఇది మీకోసమే ?

VAMSI
యాపిల్ కంపెనీకి చెందిన ఫోన్, ట్యాబ్, కంప్యూటర్ మరియు ఇతరత్రా పరికరాలను వాడే వారికి శుభవార్తను అందించింది. ఇంతకీ ఏమిటా శుభవార్త అనుకుంటున్నారా ? ప్రతి కంపెనీ తమ పరికరాలలో అప్డేట్ ల కోసం కొత్త కొత్త సాఫ్ట్ వేర్ ను అందిస్తూ ఉంటుంది. అదే విధంగా ఈ సంవత్సరం యాపిల్ కంపెనీ తమ వినియోగదారులకు ఏకంగా అయిదు సాఫ్ట్ వేర్ అప్డేట్ లను అందుబాటులోకి తేవడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని ఇటీవల యాపిల్ కంపెనీ తీసుకోవడం జరిగింది. వీటిని ఉపయోగించడం వలన యాపిల్ ప్రొడక్ట్స్ యొక్క పనితీరు మరింత మెరుగుపడుతుందని తెలుస్తోంది.
అన్ సెండ్ మెసేజ్ : అయితే ఐఒఎస్ 16 ఉన్న ఫోన్స్, టాబ్లెట్స్ మరియు కంప్యూటర్ లలో ఈ అప్డేట్ రానుంది. అయితే ఈ అప్డేట్ వలన మీరు లాస్ట్ పంపిన మెసేజ్ ను ఎడిట్ చేసే పంపే అవకాశాన్ని పొందవచ్చు. ఇక ఒకవేళ ఫస్ట్ పంపి వద్దు అనుకున్న వాళ్ళు అన్ సెండ్ కూడా చేసే సౌకర్యం ఉంది.. ఒక మెసేజ్ ను మీరు పంపాలా లేదా అని నిర్ణయించుకోవడానికి 15 నిముషాల కొద్దిపాటి సమయం ఉంటుంది.
కొత్త లాక్ స్క్రీన్: ఫోన్ లో లాక్ స్క్రీన్ ను మనము తరచూ చూస్తూ ఉంటాము. ఆండ్రాయిడ్ ఫోన్ లకోసం అయితే మనకు ఇష్టం వచ్చినట్లు మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ ఐఫోన్ లకు ఇప్పటి వరకు ఒకేరకమైన లాక్ స్క్రీన్ ను కలిగి ఉంది. అయితే ఈ సాఫ్ట్ వేర్ అప్డేట్ అయితే వెథర్, అలారమ్, విడ్జెట్స్ లాంటివి పెట్టుకునే వెసులుబాటు కలుగుతుంది.
ఇక వి మాత్రమే కాకుండా ఈ అప్డేట్ లు వచ్చిన తర్వాత ఐఫోన్ వెబ్ కామ్, ఐపాడ్ ఓఎస్ , మెడికేషన్ ట్రాకింగ్, స్నాప్ చాట్ లో పైడ్ సబ్ స్క్రిప్షన్, పిక్చర్ ఇన్ పిక్చర్ లాంటి ఫీచర్స్ మీకు అందుబాటులోకి వస్తాయి. ఎప్పటిలాగే ఐఫోన్ లో మీకు సెక్యూరిటీతో పాటుగా ఆండ్రాయిడ్ లాగా ఎక్కువ ఫీచర్ లను అందుబాటులోకి తీసుకువస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: