బుల్లి పిట్ట: గేమింగ్ ప్రియులకు శుభవార్త.. రూ.10 వేల లోపే స్మార్ట్ ఫోన్..!!

Divya
ఇటీవల కాలంలో వస్తున్న ఎన్నో స్మార్ట్ మొబైల్స్ వాటిలో గేమ్స్ ఆడుకోవడానికి అనువుగా లేవని ఎంతోమంది గేమింగ్ ప్రియులు నిరాశ వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే ప్రత్యేకంగా గేమింగ్ ప్రియులకు కొన్ని స్మార్ట్ మొబైల్స్ మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. అది కూడా కేవలం రూ.10 వేల లోపే కావడం గమనార్హం. ముఖ్యంగా అమెజాన్ లో గేమింగ్ మొబైల్ పై మంచి ఆఫర్ కూడా నడుస్తోంది. ముఖ్యంగా ఈ బ్యాంక్ ఆఫర్ తో ఆ స్మార్ట్ ఫోన్ మీరు కేవలం రూ.10 వేల లోపు కొనుగోలు చేయవచ్చు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ఎలా సొంతం చేసుకోవాలి..? వీటి ప్రత్యేకత ఏమిటి..? ఇలా అన్ని విషయాలను ఇప్పుడు ఒక సారి చదివి తెలుసుకుందాం.
ప్రస్తుతం అమెజాన్ లో  స్మార్ట్ ఫోన్ సేల్ కొనసాగుతున్న నేపథ్యంలో రియల్ మీ నార్జో 50 సిరీస్ లో రిలీజ్ చేసిన గేమింగ్ స్మార్ట్ ఫోన్ రియల్ మీ నార్జో 50 సీరీస్ అతి తక్కువ ధరకే లభిస్తుంది.. ఇకపోతే అమెజాన్ కూపన్,  బ్యాంకు డిస్కౌంట్ తో కలిపి ఈ స్మార్ట్ ఫోన్ ను మీరు కేవలం రూ.10 వేల లోపు కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే అసలు ధర రూ.12,999  కాగా 4 GB ర్యామ్ + 64 GB స్టోరేజ్ వేరియంట్ తో కలిపి ఈ స్మార్ట్ ఫోన్ మనకు లభిస్తుంది.. ఇక 6GB ర్యామ్ +  128 జీబీ స్టోరేజ్ వేరియంట్ తో రూ.15,499 కే లభిస్తుంది.
ఇక అమెజాన్ కూపన్ ద్వారా రూ. 1500 తగ్గింపు లభించగా,  ఎస్ బి ఐ క్రెడిట్ కార్డు ద్వారా డిస్కౌంట్ కూడా లభిస్తుంది .ఇక మొత్తం ఈ రెండు ఆఫర్లు మూడు వేల రూపాయల వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక అలా 4GB ర్యామ్ కలిగిన మొబైల్ మీరు కేవలం రూ.10 వేల రూపాయలతో సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: