క్రెడిట్ కార్డు ఉందా... కొంపదీసి ఇలా వాడుతున్నారా ఏంటి ?
షాపింగ్ కు వెళ్ళినా, గ్రాసరీస్ కైనా మరేదైనా సరే చాలామంది తమ క్రెడిట్ కార్డ్స్ తీసి తెగ గీకేస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డు లిమిట్ ఎంత వరకు ఉంటే అంత వరకు వాడేయకూడదని ఫైనాన్స్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో 30 శాతనికి మించి పెరగకూడదని వారు అంటున్నారు. అంతకన్నా ఎక్కువ వాడితే క్రెడిట్ స్కోర్ పై ప్రభావం పడి వడ్డీ రెట్లు పెరుగుతాయని అంటున్నారు. అంతేకాదు క్రెడిట్ యూటిలైజేషన్ రేషియను బట్టి సిబిల్ స్కోరు మారుతూ ఉంటుందట. మీరు క్రెడిట్ కార్డు లిమిట్ ను ఎక్కువ వాడుతున్నారంటే ఎక్కువ అప్పులో మునుగుతున్నారు అని అర్దం. అలాంటప్పుడు మీ సిబిల్ స్కోర్ ఎలా పెరుగుతుంది.
అత్యవసర సమయం లోనూ లేదా ఖచ్చితంగా కావాలి అనుకున్న వస్తువులో క్రెడిట్ కార్డ్ వినియోగిస్తూ పొదుపుగా వాడితే క్రెడిట్ కార్డ్స్ లభమైన మార్గమే అంటున్నారు నిపుణులు. అయితే మరికొందరు మాత్రం క్రెడిట్ కార్డ్స్ అంటేనే భయపడుతున్నారు. అది ఉంటే మనకు ఖచ్చితంగా అప్పు ఉన్నట్లే అని అపోహ పడుతూ అసలు క్రెడిట్ కార్డ్స్ వైపే చూడటం లేదు. కానీ వాస్తవానికి క్రెడిట్ కార్డ్స్ వినియోగించినపుడే ఆ డబ్బుకు తగ్గ అప్పు సదరు కంపెనీకి మీరు చెల్లించాల్సి ఉంటుంది.