వాట్సాప్ : మరో సూపర్ సెక్యూరిటీ ఫీచర్!

ఇక ప్రస్తుతం, మీరు మీ వాట్సాప్ అకౌంట్‌కు వేరే డివైజ్ ద్వారా లాగిన్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు, ఇక 6-అంకెల వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఈ 6 డిజిట్ నంబర్ ఎంటర్ చేయగానే వాట్సాప్‌కు యాక్సెస్ అనేది లభిస్తుంది. అయితే వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం, డబుల్ వెరిఫికేషన్‌ ఫీచర్ వల్ల ఈ కోడ్ ని సక్సెస్‌ఫుల్‌గా ఎంటర్ చేసినా కానీ వాట్సాప్ అకౌంట్‌కి లాగిన్ అవ్వడానికి మరొక 6-అంకెల కోడ్‌ను కూడా మీరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ కోడ్ మీ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ రూపంలో అందుతుంది. ఈ ఎస్ఎంఎస్‌లో లాగిన్ అట్టెంప్ట్ గురించి ఒక అలర్ట్ కూడా మీకు అందుతుంది.ఆ విధంగా ఈ లాగిన్ అట్టెంప్ట్‌ను మీరు కాకుండా ఇతరులు చేస్తున్నట్లయితే మీకు చాలా ఈజీగా తెలుస్తుంది. అలా ఇతర వ్యక్తి మీ వాట్సాప్ అకౌంట్‌కి లాగిన్ అవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు మీరు ఈజీగా గ్రహించవచ్చు. తద్వారా మీకు వచ్చిన సెకండ్ వెరిఫికేషన్ కోడ్‌ను ఎవరితో కూడా పంచుకోకుండా జాగ్రత్త పడొచ్చు. ఈ రెండో వెరిఫికేషన్ కోడ్ తెలిస్తే తప్ప ఎవరూ మీ అకౌంట్‌ను అసలు యాక్సెస్ చేయలేరు. 


ఫలితంగా మీ అకౌంట్‌లోని సున్నితమైన సమాచారం ఇంకా పర్సనల్ డేటా ఇతర వ్యక్తుల చేతుల్లో పడే అవకాశమే ఉండదు. అలానే వాట్సాప్ అకౌంట్లను కూడా స్వాధీనం చేసుకునే స్కామర్‌ల బెడద తగ్గుతుంది.ఈ ఫీచర్ బీటా టెస్టర్‌లకు విడుదలైనప్పుడు మరొక డివైజ్ నుంచి కూడా యూజర్‌కు సంబంధించిన వాట్సాప్ అకౌంట్‌కు లాగిన్ అవ్వాలంటే అదనపు వెరిఫికేషన్ కోడ్ ని ఎంటర్ చేయడం తప్పనిసరి. ఇక ఈ ఫీచర్ బీటా టెస్టర్లతో పాటు సాధారణ యూజర్లందరికీ ఇంకా అందుబాటులోకి రాలేదు కాబట్టి ఇతర వ్యక్తులు సిక్స్ డిజిట్ కోడ్‌ను అడిగితే వాటిని షేర్ చేయకపోవడమే చాలా మంచిది. వాట్సాప్ ఇంకా మరిన్ని ఫీచర్లు పరిచయం చేసేందుకు బాగా కసరత్తు చేస్తోంది. స్టేటస్ రిప్లై ఇండికేటర్ ఫీచర్, డిలీటెడ్ మెసేజ్‌లను అన్‌డూ చేసే ఫీచర్ ఇంకా అలాగే మెసేజ్ ఎడిట్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను లాంచ్ చేసే పనిలో వాట్సాప్ నిమగ్నమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: