బుల్లిపిట్ట: రాత్రులు కంప్యూటర్ ముందు వర్క్ చేసేవారికోసం ఈ ఫీచర్..!!

Divya
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఎక్కువగా కంప్యూటర్ తోనే పని చేస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరు కంప్యూటర్ ఎక్కువగా చూసే వాళ్ళు కళ్ళకు చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పవచ్చు. మరిముఖ్యంగా నైట్ షిఫ్ట్ లో పనిచేసే వారికి కంప్యూటర్ నుంచి వెలువడే కాంతి వల్ల కంటి సమస్యలు ఏర్పడతాయి. ఇది నిద్రపై కూడా చాలా ప్రభావం చూపుతుందట. సాధారణంగా మనకు నిద్ర రావడానికి మెలటోనిన్ అనే హార్మోను సహాయ పడుతుందట. అయితే కంప్యూటర్ లో నుంచి వెలువడి నీలికాంతి ఈ హార్మోన్ ఉత్పత్తి పై చాలా ప్రభావం చూపుతుంది దీంతో నిద్రలేమి సమస్యతో బాధపడతారు.

అయితే రాత్రిపూట కంప్యూటర్ ముందర ఎక్కువ పని చేసే వారి కోసం windose-10,11 ఆపరేటింగ్ సిస్టమ్ తో ఒక మంచి ఫ్యూచర్ ఉన్నదనే విషయం చాలా మందికి తెలియక పోవచ్చు. అయితే ఆ ఫ్యూచర్ ఏమిటంటే.. కంప్యూటర్ లో నైట్ లైఫ్ ఫీచర్ ని ఎనేబుల్ చేసుకోవడం ద్వారా కంటి పై కాంతి ప్రభావం పడకుండా చాలా జాగ్రత్త పడవచ్చు. ఈ ఫీచర్ ను ఎలా ఉపయోగించుకోవాలి అనే సందేహం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది అందుకోసం ఇప్పుడు మనం చూద్దాం.
1). ముందుగా స్టార్ట్ బటన్ లోకి వెళ్లి సెట్టింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఉంటుంది.
2). ఆ తర్వాత సెట్టింగ్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది..
3). అటు తర్వాత డిస్ప్లే లోకి వెళ్లి క్లిక్ చేసి.. ఆ తర్వాత  నైట్ లైట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
4). దీనిని ఎనేబుల్ చేసుకుంటే కంప్యూటర్ నుంచి వచ్చి బ్లూ లైట్ ఆగిపోవడం జరుగుతుంది. దీంతో స్క్రీన్ మొత్తం ఆరెంజ్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. దీనివల్ల రాత్రి సమయాలలో కంప్యూటర్ ముందు పని చేసే వారు ఈ సింపుల్ టిప్స్ తో మన కళ్ళను రక్షించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: