బుల్లి పిట్ట: మొబైల్ ఛార్జింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..!!

Divya
ప్రస్తుతం ఈ రోజులలో ఎక్కువగా అందరూ స్మార్ట్ ఫోన్ ని వినియోగిస్తూ నే ఉన్నారు. వృత్తిపరమైన అవసరాల కోసం, మన పిల్లల చదువు ఆన్లైన్ క్లాసులు కోసం, పలు వినియోగదారుల కోసం యువత ఎక్కువగా వీటిని ఉపయోగిస్తూనే ఉంది. అయితే ఇలా వాడుతున్న ఎంతసేపు మొబైల్ తరచూ ఛార్జింగ్ అయిపోయిన వెంటనే ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. ఈ తరుణంలో మనం స్మార్ట్ ఫోన్ కొనడానికి షాప్, ఆన్లైన్ లో కొనేటప్పుడు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది.
కొన్నేళ్ల క్రితం వరకు ఈ పదం ఎక్కడ ఉపయోగించక పోయినప్పటికీ ఇప్పుడిది బ్రాండ్ గా మారిపోయింది. ఇప్పుడు ఎక్కువగా వినియోగదారుల వీటిని తీసుకోవడానికి మక్కువ చూపుతున్నారు. ఎందుకంటే వేగంగా ఫోన్ చార్జింగ్ చేసే వెసులుబాటు పలు కంపెనీ లు కూడా ప్రవేశపెట్టాయి.అంటే ఇప్పుడు వస్తున్న కొత్త మోడల్స్ కూడా ఎక్కువగా వీటిని అనుసరిస్తున్నాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా స్మార్ట్ ఫోన్ కు బదులు బ్రాండ్ కలిగిన హ్యాండ్సెట్ తో తయారు చేయడం వల్ల దీని కారణంగా మొబైల్స్ ఎక్కువగా వేగంగా ఛార్జింగ్ అవుతున్నాయట.
నేటి వేగవంతమైన టెక్నాలజీలో రాపిడ్ లేదా ఫాస్ట్ ఛార్జింగ్ అనేది వినియోగదారులు ఎక్కువగా కోరుకుంటున్నారు. వాస్తవానికి అన్ని స్మార్ట్ మొబైల్స్ ఈ  ఛార్జింగ్ ను సపోర్ట్ చేయవు. కొన్ని వాటికి వేరే పరిమితులు కూడా ఉంటాయి. ఉదాహరణలకు సాంసంగ్ మొబైల్స్ 18w,25 w చార్జింగ్ మాత్రమే ఉంటుంది. రియల్ మీ స్మార్ట్ ఫోన్లు మాత్రం 18W,33w,67w సపోర్ట్ చేస్తుంది. ఇక మిగిలిన xiaomi 120W, సపోర్ట్ చార్జింగ్ ని అందిస్తుంది దీనివల్ల మన మొబైల్స్ ఛార్జ్ అవుతాయని వినియోగదారులు తెలియజేస్తున్నారు. కొన్ని సార్లు మన మొబైల్ ఆన్ చేసిన వెంటనే త్వరగా ఆఫ్ అయిపోతుందని చాలామంది కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఇలా ఎందుకు జరుగుతోంది అంటే చాలా మంది వినియోగదారులు తమ మొబైల్ ఛార్జింగ్ త్వరగా ఎక్కడానికి ఇలాంటి ఫాస్ట్ ఛార్జింగ్ ఉపయోగించడం వల్లే అని సమాచారం.అందువల్ల ఏ మొబైల్ కి ఆ చార్జర్ తోనే ఛార్జింగ్ చేసుకోవాలని నిపుణులు కూడా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: