బుల్లి పిట్ట: మొబైల్ లో ఈ విషయాలు వెతికితే ఇక జైలుకే.. అవేంటంటే..?

Divya
ప్రస్తుతం ఇప్పుడు ఉన్న రోజులలో ఎక్కువగా అందరం ఇంటర్నెట్ ని బాగా ఉపయోగించుకుంటూ ఉన్నాము. ఇక మొబైల్స్ కూడా అత్యధిక టెక్నాలజీతో రావడంతో వాటి వినియోగం కూడా భారీగానే పెరిగిపోయింది. ఇప్పుడు ఎటువంటి సమాచారం కావాలన్నా కూడా మన చేతుల్లోనే మనం చూసుకోవచ్చు. అంతలా మారిపోయింది మన టెక్నాలజీ. మనం ఎలాంటివి సెర్చ్ చేయాలన్నా వెంటనే మనకు గుర్తుకు వచ్చేది గూగుల్. ఇక ఇందులో ప్రతి ఒక్కటి సెర్చ్ చేస్తూ ఉంటాము.
అయితే ఇలాంటి సమయంలోనే కొంతమంది గూగుల్  ను దుర్వినియోగం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది ఏవైనా కొత్తగా ప్రయోగాలు చేయాలన్న ఇందులోనే చూసి చేస్తూ ఉంటారు. అలా గూగుల్ లో చూసి బాంబులు తయారు చేసిన వారు కూడా చాలా మంది ఉన్నారని సమాచారం. మరికొంతమంది అయితే ఏకంగా ఆపరేషన్లు కూడా గూగుల్ లోనే చూసి చేస్తున్నారు. దీంతో మన టెక్నాలజీ ఇప్పుడు ఎక్కడ వరకు వెళ్లిందో మనం ఊహించుకోవచ్చు. అయితే గూగుల్ లో కొన్ని అంశాలను వెతికితే ప్రభుత్వానికి చెందిన ఒక సెక్యూరిటీ ఏజెన్సీ మమ్మల్ని గుర్తిస్తుందట.

ఆ తరువాత మనల్ని జైలుకు పంపే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బాంబు తయారీ చేయడం ఎలా అనే ప్రశ్నలను అతడు గూగుల్ లో వెతక కూడదు. ఇలా చేయడం వల్ల మన IP అడ్రస్ ఆధారంగా మన ల్యాప్ ట్యాప్, మొబైల్ ఆధారంగా వాటిని గుర్తించి ప్రభుత్వ సంస్థలు.. అలా సెర్చ్ చేసేవారిని కనిపెట్టి జైలుకు పంపించే ప్రమాదం ఉంది. ఇక మరొకటి ఏమిటంటే ఆబార్షన్ . ఇది చేయడం చట్టరీత్యా నేరం కాబట్టి వీటిని గురించి ఎలా చేయాలని మనం గూగుల్ లో వెతక కూడదు ఇలా చేసేవారిని నిఘా నేత్రం ద్వారా గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా చైల్డ్ పోర్నోగ్రఫీ వంటివి గూగుల్లో వెతుకకూడదు. ఇలా వెతికితే POSCO యాక్ట్ కింద జైలుకు వెళ్లే అవకాశం 100 శాతం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: