బుల్లిపిట్ట: ఈ కార్ కేవలం 30 నిమిషాలలో ఛార్జింగ్..500 కి. మీ. మైలేజ్..!!

Divya
ప్రస్తుతం ఎన్నో రకాల కార్లు మార్కెట్లోకి విడుదల అవుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఎలక్ట్రిక్ కార్లు కూడా విడుదల అవుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ బ్రాండెడ్ కలిగిన టాటా కంపెనీ నుండి అవిన్యా అనే పేరుతో ఒక ఎలక్ట్రిక్ కారు తీసుకువస్తున్నట్లుగా టాటా మోటార్స్ సంస్థ వెల్లడించింది. ఈ అవిన్యా ఎలక్ట్రిక్ కారు చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటోంది. ఈ స్మార్ట్ కార్ సరికొత్త లుక్తో దర్శనం ఇవ్వడం జరుగుతోంది. ఈ సరికొత్త కార 2025 నాటికి మార్కెట్లోకి తీసుకు వస్తున్నట్లుగా టాటా మోటార్స్ సంస్థ ప్రకటించింది.
ఈ సరికొత్త ప్యూచర్ తో థర్డ్ జనరేషన్ ఆర్కిటెక్చర్ ల ఆధారంగా చేసుకొని ఈ కారును రూపొందిస్తున్నట్లు గా తెలియజేసింది ఆ సంస్థ. అయితే ఈ కారు కేవలం 30 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్ అవుతుందని తెలియజేసింది. ఇక అంతే కాకుండా అలా ఛార్జ్ అయిన సామర్థ్యాన్ని సపోర్ట్ ఇచ్చే విధంగా ఒక బ్యాటరీని కూడా అమర్చడం జరిగిందని కంపెనీ వారు తెలియజేస్తున్నారు. అలా దాదాపుగా 500 కిలోమీటర్ల దూరం వరకు ఈ కారు ప్రయాణించగలదు అని ఆ సంస్థ తెలిపింది.

ఈ కారుకు ఆకర్షణీయమైన ఎల్ఈడీ లైట్లను  టి ఆకారంలో అందిస్తోందట. ఇక ఈ కారు ముందు భాగాన ఒక పెద్ద బ్లాక్ పానెల్ ను కూడా అమర్చడం జరిగింది. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు భారత రోడ్లు, వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండే విధంగా తయారు చేస్తున్నట్లు టాటా మోటార్స్ వారు తెలియజేశారు. అంతేకాకుండా సేఫ్టీ సెక్యూరిటీ లో ఈ ఎలక్ట్రిక్ కారు చాలా శక్తివంతమైనదని తెలియజేశారు. ఇందులో పోస్ట్ ప్రొడక్షన్ కోసం అడ్వాంటేజ్ పరికరాలను అమర్చారు. మరీ ముఖ్యంగా డ్రైవర్ అసిస్టెంట్ సిస్టం ను కూడా అమర్చినట్లు తెలియజేశారు. మరి కొద్ది రోజులలో ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: