బుల్లిపిట్ట: రూ.6,999 కే స్మార్ట్ ఎల్ఈడి టీవీ.. ఎక్కడంటే..?

Divya
ఈ న్యూ ఇయర్ కి కొత్త ఎల్ఈడి టీవీ కొనాలని చూస్తున్నారా..? అయితే మీకు ఒక చక్కని శుభవార్తను మోసుకొచ్చింది ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. సుమారుగా 61 సెంటీమీటర్ల ఎల్ఈడి టీవీ కేవలం రూ.6,999 కే మీరు సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలను కూడా అమెజాన్ అందించడం జరిగింది. అదేంటో ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం..

ఈ కామర్స్ దిగ్గజాలు అయినటువంటి ఫ్లిప్ కార్ట్ అలాగే అమెజాన్ నిర్వహించిన దీపావళి సేల్ ముగిసింది. ఇక ఈ సేల్స్ లో ఇప్పటివరకు ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువుల పై సరికొత్త బంపర్ ఆఫర్లను ప్రకటించి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి ఈ - కామర్స్ సంస్థలు. అంతేకాదు ఈ సేల్ కు కస్టమర్ల నుంచి మంచి స్పందన కూడా లభించడం గమనార్హం.. కొన్ని వేల మంది తమకు ఇష్టమైన ఎలక్ట్రానిక్ పరికరాలను కేవలం అతి తక్కువ ధరకే ఆఫర్లతో పాటు డిస్కౌంట్లతో కూడా సొంతం చేసుకుంటున్నారు.. ఇక ఫెస్టివల్ సేల్ ముగిసిన తర్వాత కూడా కొన్ని ఉత్పత్తులపై ఇంకా డిస్కౌంట్లు అందజేస్తున్నాయి ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు..మీరు కూడా కొనుగోలు చేయాలి అనుకుంటే తక్కువ బడ్జెట్ తో బెస్ట్ ఆప్షన్ ఎల్ఈడి టీవీ ని కొనుగోలు చేసుకోవచ్చు..
అమెజాన్ అందిస్తున్న ఈ చక్కటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి.. స్మార్ట్ హెచ్ డి ఎల్ ఈ డి టీవీ e Airtech 24 అంగుళాల హెచ్ డి ఎల్ ఈ డి టీవీ అలాగే 24 డి జె టీవీ ని మీరు అమెజాన్ లో కేవలం రూ.6,999 కే సొంతం చేసుకోవచ్చు. ఇక మార్కెట్లో ఈ టీవీ ధర పది వేల రూపాయలు ఉండగా ప్రస్తుతం మూడు వేల రూపాయల బంపర్ ఆఫర్ తో మనకు లభిస్తుంది. ఈఎంఐ ద్వారా నెలకు 329 రూపాయలకు కూడా ఇది అందుబాటులోకి రావడం గమనార్హం. ఇక ఇందులో 2 USB పోర్ట్ కనెక్టివిటీ, 2 HDMI, వన్ VGA పోర్ట్ ను పొందుపరిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: