ఫేస్ బుక్ యూజర్లకు బిగ్ షాక్.. మరికొన్ని రోజుల్లో..

Deekshitha Reddy
ఫేస్ బుక్.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్.. నేటి రోజుల్లో ఫేస్ బుక్ మన జీవన విధానంలో ఒక భాగంగా మారింది. ఒక్కరోజైనా ఫేస్ బుక్ ను చూడకుండా ఉండలేని పరిస్థితి. ఎక్కడైనా.. ఎప్పుడైనా ఫేస్ బుక్ వాడాల్సిందే. ప్రతీ అప్డేట్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయాల్సిందే.. అంతలా నేటి యువతరంతో కలిసిపోయింది ఫేస్ బుక్. అయితే ఇదంతా ఇప్పటివరకూ జరిగిన విషయం.. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారేలా కనిపిస్తున్నాయి. ఇటీవల ఏకంగా 7 గంటలపాటు ఏకబిగిన సేవలు నిలిచిపోవడంతో, ఫేస్ బుక్ క్రేజ్ బాగా పడిపోయిందనే చెప్పాలి.
ప్రపంచ వ్యాప్తంగా ఫేస్ బుక్ తో పాటూ.. ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్.. సేవలు కూడా శుక్రవారం రోజు కొద్దిసమయం నిలిచిపోవడంతో యూజర్లు చాలా ఇబ్బంది పడ్డారు. సర్వర్లో సమస్యలని చెబుతున్నా.. అసలు కారణం మాత్రం కచ్చితంగా ఎవరూ చెప్పలేక పోతున్నారు. ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కూడా ఈ విషయంలో రెండోసారి యూజర్లకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. జుకర్ బర్గ్ సంపద కూడా ఈ కారణంగా ఆవిరైంది. ఈ విషయం ఎలా ఉన్నప్పటికీ చాలామంది ఫేస్ బుక్ నిలిచిపోవడంతో దానికి
ప్రత్యామ్నాయాన్ని కూడా వెదికారు. అందరూ ఒక్కసారిగా టెలిగ్రామ్ యాప్ పై పడ్డారు.
అయితే ఫేస్ బుక్ లో వరుసగా రెండోసారి సాంకేతిక సమస్య తలెత్తడం ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇది ఇక్కడితో ఆగలేదని, రాబోయే రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  ఫేస్ బుక్ కి ప్రత్యామ్నాయం రానుందని కూడా కొందరు టెకీలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఫేస్ బుక్ కు పోటీగా మరొక యాప్ డెవెలప్ చేస్తున్నాయని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే పోటీదారులు ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఏది ఏమైనా మరొక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ రావడం మాత్రం స్వాగతించదగిన పరిణామమే. అయితే రాబోయే యాప్, ఫేస్ బుక్ లాగానే జనాన్ని ఆకట్టుకోగలుగుతుందా లేక హడావిడి మాత్రమే మిగులుతుందా అనేది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: