బుల్లి పిట్ట: అమెజాన్ సంస్థ నుంచి సరికొత్త ఫ్రిడ్జ్.. ఫీచర్స్ ఇవే..!

Divya
అమెజాన్ ప్రొడక్ట్... అమ్మకంలోనే కాకుండా మార్కెట్లో కూడా సరికొత్త ప్రొడక్ట్స్ ను పరిచయం చేయనుంది. అదేమిటంటే అమెజాన్ నుంచి ఒక సరికొత్త స్మార్ట్ ఫ్రిజ్ ను తయారు చేసి, వారే స్వయంగా ఆ ఫ్రిజ్ ను సేల్ చేయనున్నట్లు సమాచారం. దీనిని ఎటువంటి వంట గదిలో నైనా అమర్చుకునే విధంగా దీనిని తీర్చిదిద్దనున్నారు.

ఇక తాజా నివేదిక ప్రకారం ఈ కొత్త స్మార్ట్ ఫ్రిడ్జ్ ప్రొడక్ట్ కు "ప్రాజెక్ట్ పల్స్"అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది.ఇక ఈ ఫ్రిడ్జ్ ఒక అధునాతన ఫీచర్లతో దీనిని తయారు చేస్తున్నారు. అంతేకాకుండా ఫ్రిడ్జ్ లో ఏ ఆహార పదార్థాలు ఉంచాలో ముందుగానే అంచనా వేస్తుందట. ఇక అంతే కాకుండా మనం ఫ్రిజ్లో పెట్టినటువంటి ఏవైనా సరుకులు అయిపోయాయి అంటే వాటి సమాచారాన్ని కూడా ఇస్తుందట.
సాధారణంగా పాలు, పెరుగు,  మాంసకృత్తులు వంటివి కేవలం కొన్ని రోజులే అవి ఉపయోగపడుతాయి. అలాంటివి మనం ఉపయోగించుకోకున్నట్లయితే అందుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఫ్రిడ్జ్ మనకు అందిస్తుంది. ఇక ప్రస్తుతం ఫ్రిడ్జ్ లో ఎలాంటి వస్తువులు ఉన్నాయి.. ఇంకా ఎలాంటి వస్తువులు కావాలి, ఫ్రిజ్ లో ఉన్న వస్తువులతో ఎలాంటి వంటలు చేసుకోవచ్చు వంటి సమాచారాన్ని కూడా అందిస్తుందట.
ఇక ఈ సంవత్సరంలో వచ్చిన స్మార్ట్ ఫ్రిడ్జ్ లు అంత కొత్తవేమీ కావు.. కేవలం పాత ఫీచర్లతో నే అందుబాటులోకి వచ్చాయి. అయితే తాజాగా అమెజాన్ తయారు చేస్తున్నటువంటి ఈ స్మార్ట్ ఫ్రిడ్జ్ మరికొన్ని అప్డేట్ ఫీచర్లతో మన ముందుకు రానుంది. ఈ స్మార్ట్ ఫ్రిడ్జ్ లో మనం నిల్వచేసుకునే కిరాణా సరుకులు నుండి కిరాణా సరుకులు అయిపోయాయి అంటూ ఆర్డర్ చేసే విధంగా కూడా ఈ ఫ్రిజ్ ను రూపొందిస్తున్నారట. ఇక అంతే కాకుండా అమెజాన్ కంపెనీ తయారు చేయబడిన ఈ ఫ్రిడ్జ్ అమెజాన్ కిరాణా సేవలను కూడా అందిస్తోంద ట.
ఏది ఏమైనా ఈ స్మార్ట్ ఫ్రిడ్జ్ మార్కెట్లో విడుదల అయితే ఇప్పుడు ఉన్నటువంటి కంపెనీలకు గట్టి పోటి ఇవ్వనుంది. ఇక ఈ ఫ్రిడ్జ్ ధర కాస్త ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దాదాపుగా రూ.1.5 లక్షలు అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: