బుల్లిపిట్ట: మీ మొబైల్ సేఫ్ గా ఉందో లేదో ఇలా చెక్ చేయండి..!

Divya
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మనం నిత్యం ఎన్నో పనులను స్మార్ట్ ఫోన్ లోనే నిర్వహిస్తూ ఉంటాము. ఇక ముఖ్యంగా ఆన్లైన్ లావాదేవీలు, ఆఫీసు పనులు లాంటివి ఎన్నో చేస్తూ ఉంటాము. ఇక ఇదే అదునుగా తీసుకుని సైబర్ నేరగాళ్లు రకరకాల ఎత్తుగడలు వేస్తూ, మన మొబైల్లో ఉండేటువంటి డబ్బులు కాజేస్తూ ఉంటారు. దీంతో చాలామంది నష్టపోతూ ఉంటాము. ఇక ఇదంతా కేవలం ఒక వైరస్ ద్వారా చేస్తారు అన్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.
మాల్వేర్ అనే వైరస్ కంప్యూటర్ లను నాశనం చేయడానికి రూపొందించబడిన ఒక సాఫ్ట్ వేర్. ఇది మన మొబైల్ లో ఉన్నదో లేదో తెలుసుకోవాలంటే ఇలా చేస్తే సరి.
1). మన మొబైల్ ని ఎక్కువగా ఉపయోగించినపుడు అది అధిక వేడి అవుతుంటే అప్పుడు మనం కచ్చితంగా ఆ మొబైల్ ని అనుమానించాల్సిందే. మొబైల్ బ్యాక్ గ్రౌండ్ లో ఏదో ఒక అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతున్నట్లుగా గుర్తించాలి.
2). మనం వాడే మొబైల్ డేటా వాడకుండా ఎక్కువగా అయిపోతుంటే మీ మొబైల్లో ఉండేటువంటి అప్లికేషన్లను ఒకసారి పరిశీలించండి.
3). అనవసరమైన ప్రకటనలు మీ మొబైల్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయా.. ? అలా వచ్చిందంటే..  హానికరమైన మాల్వేర్ వైరస్ ఫోన్ కి సోకుతుందని అర్థం.
4). ఇక అంతే కాకుండా మీ మొబైల్ లో ఏ యాప్ లు ఎక్కువగా డేటాను వినియోగిస్తున్నాయో ఒకసారి చెక్ చేసి వాటిని తొలగించడం మంచిది.
5). మీ మొబైల్ లో మీకు తెలియకుండా కొన్ని యాప్స్ ఉన్నట్లయితే వాటిని తొలగించడం మంచిది.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు:
1). మనకు తెలియని యాప్ లను ఇన్స్టాల్ చేసుకో కూడదు.
2). ప్లే స్టోర్, యాపిల్ ప్లేస్టోర్ వంటి వాటిలోనే యాప్లను వాడుకోవాలి.
3). యాప్ ఇన్స్టాల్ చేసేముందు పర్మిషన్ లను చెక్ చేసుకోవాలి.
4). అనవసరపు యాప్  ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవడం ఉత్తమం.
చివరిగా అవసరమనుకుంటే ఒక యాంటీవైరస్.. సాఫ్ట్ వేర్ ను మొబైల్ లో వేసుకుంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: