ఐఫోన్‌లో స్టోరేజ్ సమస్యా ? ఇలా చేస్తే సరి !

Vimalatha
ఐఫోన్ వినియోగదారులు మొదటి నుండి స్టోరేజ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఐఫోన్ 13 సిరీస్ కెమెరాలు అప్‌గ్రేడ్ చేశారు. ఇందులో వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లు చేర్చారు. ఇందులో సినిమా రికార్డింగ్ ఆప్షన్ కూడా పొందుతారు. ఐఫోన్ వీడియో నాణ్యత గురించి అందరికీ తెలిసిందే. కానీ చాలా సార్లు ఐఫోన్ కెమెరాతో వీడియోను రికార్డ్ చేసినప్పుడు, అది ఫోన్ లో అధిక స్టోరేజ్‌కారణంగా ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఇమెయిల్ పంపే సమయంలో కూడా దానిని యాడ్ చేయలేము. ఈ సమస్య నుంచి యూజర్స్ ను బయటపడేయడానికి యాపిల్ ఇంకా ఎలాంటి ఆప్షన్ ఇవ్వలేదు. కానీ ఈ రోజు ఐఫోన్ వీడియోను ఎలా కంప్రెస్ చేయవచ్చో తెలుసుకుందాం. వీడియో 4k, 1080p క్వాలిటీలో ఉండకూడదు అనుకుంటేనే డి సాధ్యపడుతుంది. ఇప్పటికే వీడియోను రికార్డ్ చేసి దానిని చిన్నదిగా చేయాలనుకుంటే కొన్ని టూల్స్ ఉపయోగించాలి.
 1. ముందుగా యాప్ స్టోర్ నుండి వీడియో కంప్రెస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
2. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత హోమ్‌పేజీలో ఉండే జెయింట్+ గుర్తుపై క్లిక్ చేయాలి.
3. దీని తర్వాత యాప్ మిమ్మల్ని కొన్ని అవసరమైన అనుమతుల కోసం అడుగుతుంది. దీనిలో మీరు ఫోటోల యాప్‌కు యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని తర్వాత మీరు సరే క్లిక్ చేసి ఆపై కంప్రెస్ చేయాలనుకుంటున్న వీడియోను ఎంచుకోండి.
4. దీని తర్వాత మీరు ఎంత స్థాయి కంప్రెషన్ ఉంచాలనుకుంటున్నారో యాప్ అడుగుతుంది. దీనిలో మీరు నిమిషానికి 28.6MB వరకు పూర్తి HD నాణ్యత గల వీడియోను కంప్రెస్ చేయవచ్చు, అది కూడా 360p వరకు నిమిషానికి 3.6MB వరకు కంప్రెస్ చేస్తుంది.
5. యాప్ కంప్రెస్ చేసిన తర్వాత ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారని అడుగుతుంది.
6. ఎంచుకున్న తర్వాత వీడియో కంప్రెషన్ మొదలవుతుంది. ఈ పనికి 30 సెకన్లు పట్టవచ్చు.
7. చివరగా మీరు అసలు వీడియోను ఉంచాలనుకుంటున్నారా లేదా తొలగించాలనుకుంటున్నారా అని యాప్ మిమ్మల్ని అడుగుతుంది.  ఆ తరువాత సేవ్ చేసిన ప్లేస్ లో కంప్రెస్ చేసిన వీడియో కన్పిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: