ప్రైవేట్ రోదసి యాత్ర .. ఇక అంతరిక్షం మనందరిది ..
స్పేస్ ఎక్స్ సంస్థ ఈ ప్రయోగాలు చేస్తూ, ప్రజలను అంతరిక్షంలోకి తీసుకెళ్లి అక్కడ కొన్నాళ్ళు ఉంది వచ్చేట్టుగా ఏర్పాట్లు చేస్తుంది. దానికోసం ప్రాథమిక ప్రయోగాలు చేసి విజయవంతం అయ్యింది. ఇప్పటికే అంతరిక్షంలో పర్యాటకానికి కొందరు టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నారంటే దీనిపై కొందరు ఎంత ఆసక్తిగా ఉన్నారో తెలుస్తుంది. దానిని కాష్ చేసుకుంటుంది ఈ సంస్థ. పుర్రెకో బుద్ది అన్నట్టుగా సంక్షోభంలో కూడా ఇలాంటి ఆలోచన చేస్తూ దానికోసం ముందుకు పోతుంది ఈ సంస్థ. దీనికోసం ప్రాధమికంగా కొందరికి తర్ఫీదు ఇస్తున్నారు. ముందు వీళ్ళను రోదసి లోకి ప్రయోగాత్మకంగా పంపిస్తారు. ఇలా అనేక ప్రయోగాల అనంతరం సాధారణ ప్రజలను రోదసీలోకి తీసుకెళ్లనుండి ఈ సంస్థ.
తాజాగా సంస్థ మూడు రోజులపాటు రోదసి యాత్ర చేశారు. అపరకుబేరుడు జేర్డ్ ఐసాక్ మాన్ ఆధ్వర్యంలో నలుగురు పర్యాటకులు 3 రోజులపాటుగా రోదసిలో చక్కర్లు కొట్టి విజయవంతంగా భూమిని చేరారు. వీరు క్రు డ్రాగెన్ వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. ఇందులో వెళ్లిన వారు ఎవరు అంతరిక్ష యాత్రలో నిపుణులు కాకపోవడం విశేషం. ఇది విజయవంతం కావటంతో సంస్థ మరిన్ని ప్రయోగాలకు సిద్ధం అయ్యింది. ఎలాన్ మాస్క్ తన రోదసి ద్వారా మొదటిసారి అంతరిక్షంలోకి పర్యాటకులను పంపిన మొదటి వ్యక్తిగా చరిత్ర కెక్కారు. ఈ ప్రయాణంలో పర్యాటకులకు సాధారణ ఆహారం కూడా అందుబాటులో ఉంచడం విశేషం, అంటే పిజ్జా, సాండ్ విచ్, పాస్తా, మాంసం తదితరమైనవి.