యూట్యూబ్ లో ఒక రోజు షార్ట్ వీడియోల‌కు ఎన్ని కోట్ల వ్యూస్ వ‌స్తున్నాయో తెలుసా?

ప్ర‌పంచాన్ని క‌రోనా వైరెస్ ప‌ట్టి పీడిస్తే అన్ని దేశాల‌లో ఆయా ప్ర‌భుత్వాలు కొన్ని నెల‌లా పాటు లాక్ డౌన్ ను విధించాయి. ఎంతో మంది ఉద్యోగాలకు దూర‌మయ్యారు. దీంతో ప్ర‌జ‌లంతా ఎంటెర్ టైన్ మెంట్ ను కోరుకున్నారు. సినిమా షూటింగ్ లు కూడా బంద్ కావ‌డంతో సినిమాలు కూడా అందుబాటు లో లేవు. అలాంటి సంద‌ర్భంలో ప్ర‌పంచా ప్ర‌జ‌లు ఎంట‌ర్ టైన్ మెంట్ కోసం సోష‌ల్ మీడియా వైపు ఆక‌ర్షితులు అయ్యారు. అందులో భాగంగా చాలా మంది యూట్యూబ్ ను వాడారు. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా యూట్యూబ్ వాడ‌కం గ‌ణ‌నీయంగా పెరిగిపోయింది. గ‌త సంవ‌త్స‌రం కంటే ఈ ఏడాది యూట్యూబ్ వాడ‌కం దాదాపు 45 శాతం పెరిగింద‌ని ఒక స‌ర్వె లో తెలుస్తోంది. అలాగే దాదాపు 85 శాతం విక్ష‌కులు పెరిగార‌ని స‌మాచారం.

అలాగే ఇండియాలో టిక్ టాక్ యాప్ ను బ్యాన్ చేయ‌డంతో షార్ట్ వీడియో ల కోసం చాలా మంది యూట్యూబ్ ను ఎంచుకున్నారు. దీంతో షార్ట్ వీడియో వీక్ష‌న‌లో యూట్యూబ్ ముందు వ‌రుస లో ఉంది. అంతే కాకుండ షార్ట్ వీడియో ను  క్రియెట్ చేసే వారి సంఖ్య సైతం గ‌ణ‌నీయంగా పెరిగింది. అలాగే తెలుగు, హింది, త‌మిళం వంటి భాష‌ల‌లో కంటెంట్ ను  ఆస్వాధించే వారి సంఖ్య రోజు రోజుకూ అధికం అవుతోంది.  యూట్యూబ్ వీడియో ద్వారా దాదాపు 85 శాతం మంది త‌మ‌లో ఉన్న నైపుణ్యాన్ని ఇంకా పెంచుకుంటున్నామ‌ని తెలుపుతున్నారు.

ఈ ఏడాది మే నెల‌లో విద్య‌ర్థుల కెరియార్‌, అలాగే  ఉద్యోగుల కెరీర్ వంటి విష‌యాలకు సంబంధించిన వీడియో ల‌కు దాదాపు 60 శాతం వ్యూస్ పెరిగాయాని తెలుస్తుంది. కేవ‌లం ఒక 140 యూట్యూబ్ ఛాన‌ళ్ల‌కు స‌బ్ స్కైబ‌ర్లు ఉన్నార‌ని స‌మాచ‌రం ఒక రోజులో షార్ట్ వీడియో లకు దాదాపు 1500 కోట్ల వ్యూస్ వ‌స్తున్నాయ‌ని  ఒక స‌ర్వె లో తెలింది. వీరంత కేవ‌లం మొబైల్ లో మాత్ర‌మే కాదు. టీవీల‌ల్లోనూ యూట్యూబ్ విక్ష‌న‌లు పెరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: