ఫోర్డ్ ఇండియా ఫ్యాక్టరీలను కొనాలనుకుంటున్న ఎంజి మోటార్స్

ఫేమస్ అమెరికన్ కార్ల కంపెనీ ఫోర్డ్ (Ford) త్వరలోనే ఇండియాలో తమ వ్యాపార కార్యకలాపాలను ఆపేసి వాటికి స్వస్తి పలికి, దేశం విడిచి వెళ్లిపోనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసినదే. ఇక ఈ నేపథ్యంలో, ఇండియాలో ఫోర్డ్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు చైనీస్ కార్ కంపెనీ అయినా ఎమ్‌జి మోటార్ (MG Motor) ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం తెలుస్తుంది.ఇక ఈ మేరకు ఫోర్డ్ ఇండియా (Ford India)  గుజరాత్‌లోని సనంద్ ఇంకా తమిళనాడులోని మరైమలై నగర్ ఫ్యాక్టరీలను కొనుగోలు చేయడానికి MG ఆసక్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం తెలిసింది. అయితే, ప్రస్తుతం ఈ చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని సమాచారం తెలుస్తుంది. కాబట్టి, MG Motor ఈ ప్రశ్నార్థకమైన ఫ్యాక్టరీలను కొనుగోలు చేస్తుందో లేదో అనే విషయం అయితే ఇంకా ఖచ్చితంగా తెలియదనే చెప్పాలి.ఇక ప్రస్తుతం ఫోర్డ్ ఇండియా కంపెనీకు వేరే ఆప్షన్ లేదు.

ఇక గత కొన్ని సంవత్సరాలుగా ఈ అమెరికన్ బ్రాండ్ ఇండియాలో భారీ నష్టాలను చవిచూస్తూ వస్తోంది. ఇక ఈ నష్టం వచ్చేసి సుమారు 2 బిలియన్ డాలర్లు ఉంటుందని కంపెనీ అంచనా వేయడం జరిగింది. కరోనా మహమ్మారి ఫస్ట్ వేవ్‌కి ముందు ఇండియా ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) కంపెనీతో ఫోర్డ్ ఇండియా (Ford India) కుదుర్చుకున్న జాయింట్ వెంచర్ కూడా ఆదిలోనే ఆగిపోవడం జరిగింది.ఇక ఈ నేపథ్యంలో, ఫోర్డ్ ఇండియా ఫ్యూచర్ లో మరిన్ని నష్టాలను ఎదుర్కునే బదులుగా ఉన్న ఆస్తులను అయినా అమ్ముకొని, కొంత వరకు అయినా తమ నష్టాలను పూడ్చుకుంటే మంచిదనేది నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో ఫోర్డ్ తమ కార్ల ఉత్పత్తిని నిలిపివేసిన తర్వాత, దేశంలోని ఈ రెండు ప్లాంట్‌లు త్వరలో మూసివేయబడటం జరుగుతుంది.అందుకే వీటిని ఎమ్‌జి వంటి అభివృద్ధి చెందుతున్న ఆటోమొబైల్ కంపెనీకి అమ్మితే రెండు కంపెనీలకు కూడా లబ్ధి చేకూరే అవకాశం అనేది ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: