జియో, ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్... ఏది బెటర్ అంటే ?

Vimalatha
ప్రస్తుత కల్మాలో దాదాపు ప్రతి ఒక్కరూ ఓటిటి కంటెంట్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరూ దీనిని చూసే అవకాశం ఉండట్లేదు. ఎందుకంటే దీనికి చాలా డేటా పడుతుంది. రెండవ కారణం ఈ ఓటిటి ప్లాట్‌ఫామ్‌ల మెంబర్ షిప్ పేమెంట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. మీది కూడా అదే సమస్య అయితే మీకు పరిష్కారం దొరికినట్టే. మన దేశంలోని ప్రధాన టెలికాం కంపెనీలు జియో, ఎయిర్‌టెల్ కస్టమర్లకు అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. దీనిలో మీరు తక్కువ ధర డేటా, ఓటిటి ప్లాట్‌ఫామ్‌లకు సబ్‌స్క్రిప్షన్‌లు, అనేక ఇతర ప్రయోజనాలను పొందుతారు. మూడు కంపెనీల ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం. ఏ ప్లాన్ బెస్ట్ అనేది మీరే ఎంచుకోండి.
జియో ప్రీపెయిడ్ ప్లాన్స్
జియో ఇటీవల తన వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేసింది. ఆ తర్వాత అన్ని అప్‌గ్రేడ్ ప్లాన్‌లలో డిస్నీ + హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగదారులకు అందిస్తోంది. రూ.499 నుండి ప్రారంభమయ్యే ఈ ప్లాన్‌లో మీకు రోజువారీ 3జిబి డేటా, డిస్నీ + హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు ఉంటుంది.
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు
ఎయిర్‌టెల్ రూ . 289 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 1.5 జిబి డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్ లిమిటెడ్ కాలింగ్, జీ5 ప్రీమియం మెంబెర్ షిప్ అందిస్తుంది. ఈ ప్లాన్స్ అన్నీ 28 రోజులు వస్తాయి. ఈ ప్లాన్‌లో ఎయిర్‌టెల్ ఎక్స్-స్ట్రీమ్ ప్రీమియం, ఫ్రీ హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్, షా అకాడమీ, ఫాస్‌ట్యాగ్‌పై కస్టమర్‌లు రూ .150 క్యాష్‌బ్యాక్ పొందుతారు.
ఎయిర్‌టెల్ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2.5 జిబి డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్ లిమిటెడ్ కాలింగ్, అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను అందిస్తుంది. అయితే ఈ ఫీచర్ల చెల్లుబాటు 28 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ ప్లాన్‌లో ఎయిర్‌టెల్ ఎక్స్-స్ట్రీమ్ ప్రీమియం, ఉచిత హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్, ఉచిత ఆన్‌లైన్ కోర్సులు, ఫాస్‌ట్యాగ్‌పై కస్టమర్‌లు రూ .100 క్యాష్‌బ్యాక్ పొందుతారు.
ఎయిర్‌టెల్‌లో రూ .499 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఉంది. ఇది రోజుకు 3 జిబి డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్ లిమిటెడ్ కాలింగ్, 28 రోజుల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ని అందిస్తుంది. డిస్నీ + హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ధర రూ .499 కాబట్టి ఈ ప్లాన్ చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ మీరు అదే ధరకు ఇతర ప్రయోజనాలను కూడా పొందొచ్చు కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: