బుల్లి పిట్ట: షియోమీ స్మార్ట్ గ్లాసెస్.. వీటితో కాల్స్ కూడా చేయవచ్చట..!

Divya
షియోమీ.. భారత మార్కెట్లోకి ప్రతిసారి సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీ లను ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే.. అంతే కాదు భారత మార్కెట్లో ప్రముఖ బ్రాండ్ గా కూడా గుర్తింపు పొందింది. ఇప్పుడు కూడా సరికొత్తగా స్మార్ట్ గ్లాసెస్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.. ముఖ్యంగా షియోమీ బ్రాండ్ నుంచి మొదటిసారిగా వచ్చిన స్మార్ట్ గ్లాసెస్ ఇవి.. ఈ గ్లాసెస్ చూడడానికి సాధారణమైన సన్ గ్లాసెస్ లాగా కనిపిస్తాయి. కానీ వీటి ప్రత్యేకత లు చూస్తే మాత్రం అదిరి పోవాల్సిందే..

ముఖ్యంగా ఈ సన్ గ్లాసెస్ సెన్సార్ లతో వర్క్ అవుతాయట.. అంతే కాదు ఇమేజ్ సిస్టంతో  స్మార్ట్ ఫీచర్లను కూడా ఎనేబుల్ చేసే కెపాసిటీ ఈ గ్లాసెస్ ఉందట. చాలా లైట్ వెయిట్ గా కేవలం 51 గ్రాములు మాత్రమే ఈ స్మార్ట్ గ్లాసెస్ బరువు కలిగి ఉంటాయి.. వీటిలో మైక్రో ఎల్ఈడి ఆప్టికల్ వేవ్ గైడ్ టెక్నాలజీని పొందుపరిచినట్లు సమాచారం. అంతేకాదు ఈ స్మార్ట్ గ్లాస్ ను ఉపయోగించి కాల్స్ కూడా చేయవచ్చు.. ఫోటోలు కూడా తీయవచ్చు .నావిగేషన్ ని సెట్ చేసుకోవచ్చు.. మన కళ్ళ ముందు ఉన్న టెక్స్ట్ ను కూడా ట్రాన్స్లేట్ చేసే ఫీచర్ కూడా ఇందులో కల్పించబడింది..
వీటిని షియోమీ సంస్థ విడుదల చేసినప్పటికీ , తేదీ ని  మాత్రం అందుబాటులోకి తీసుకు రాలేదు. ఇకపోతే ఈ సన్ గ్లాసెస్ ను ముందుగా చైనా లోవిడుదల చేసి , ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు వెల్లడించారు.. ఈ స్మార్ట్ గ్లాసెస్ లో ఫైవ్ ఎంపీ కెమెరాలు కూడా ఇంటిగ్రేట్ చేశారు.. అంతేకాదు ఆండ్రాయిడ్ ఓఎస్ తో ఇవి పని చేస్తాయి. టచ్ పాడ్ , బ్లూటూత్ ,వైఫై , క్వాడ్ కోర్ ప్రాసెసర్ లాంటి ఎన్నో ఫీచర్లు ఈ గ్లాసెస్ లో చేర్చబడ్డాయి. అయితే వీటిని ఎప్పుడు భారత మార్కెట్లోకి విడుదల చేస్తారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: