ఐఫోన్ కొంటున్నారా...? అయితే ఇది మీ కోసమే...!

Sahithya
కాలిఫోర్నియా స్ట్రీమింగ్ ఈవెంట్‌ లో, ఆపిల్ తన కొత్త మోడల్ ఐఫోన్ ను విడుదల చేసింది. ఐఫోన్ 12 మాదిరిగా 13 ను కూడా విడుదల చేయడం విశేషం. ఐఫోన్ అనగానే ఉండే క్రేజ్ మనకు చాలా వరకు తెలుసు. దాని కోసం అప్పులు కూడా చేయడం వింటూ ఉంటాం మనం. ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఇప్పుడు మన దేశంలో కొత్త ఐఫోన్ రాగానే పాత ఐఫోన్ మోడల్ ధరను తగ్గించారు. అయితే ఇప్పుడు కొత్త ఐఫోన్ కొనాలా వద్దా అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. అయితే నిపుణులు మాత్రం ఈ విషయంలో కొన్ని సూచనలు చేస్తున్నారు.
పాత మోడల్ కంటే ఈ మోడల్ లో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్పారు. ఐఫోన్ 13 సరికొత్త 128GB బేస్ మోడల్ రూ. 79,900 నుండి మొదలవుతుంది. రూ .89,900 ధరతో 256 జీబీ స్టోరేజ్ మోడల్ ఉంది. 512 జీబీ మోడల్ రూ. 109,900 గా ఉంది.  1టీబీ స్టోరేజ్ మోడల్‌ లో 13 ప్రో మరియు ప్రో మ్యాక్స్ ఉన్నాయి. అయితే  ధర విషయంలో పోలిస్తే ఐఫోన్ 12 కంటే కూడా ఐఫోన్ 13 లాంచ్ ధర తక్కువగానే ఉంది. ఐఫోన్ 13 మరియు ఐఫోన్ 12 రెండింటి లాంచ్ ధరలతో పోలిస్తే చాలా తేడా ఉంది.
ఐఫోన్ 12 ఇప్పుడు రూ. 65,900 నుండి ప్రారంభమవుతుంది. మొన్నటి తో పోలిస్తే ఇప్పుడు 14 వేల వరకు ధర తగ్గించారు. 128 జీబీ మోడల్ రూ .70,900 కి వస్తుంది, 256 జీబీ మోడల్ రూ .80,900 గా ఉంది. మీరు ధరలను నిశితంగా పరిశీలిస్తే... కొంచెం అదనంగా చెల్లించి... ఐఫోన్ 13 128 జీబీ కొనుక్కోవచ్చు. ఐఫోన్ 13 సెప్టెంబర్ 24 నుండి మన దేశంలో దొరుకుతుంది.  ఆసక్తి ఉన్న వినియోగదారులు ఈ శుక్రవారం నుండి ముందుగా బుక్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: