మాకు ఎవరి సహాయం అవసరం లేదు : ఆపిల్.

శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన టెక్‌ దిగ్గజం ఆపిల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన క్వాలిటీ ప్రొడక్ట్స్ తో ఎప్పుడూ కూడా కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక యాపిల్ కంపెనీ తన ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీపై  స్పష్టతనివ్వడం జరిగింది.ఎలాంటి ఆటోమొబైల్‌ కంపెనీల సహయం లేకుండా తాము ఒంటరిగానే ఎలక్ట్రిక్‌ వాహనాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఒక ప్రకటనలో ఆపిల్‌ పేర్కొనడం జరిగింది. ఇక మెయిల్ ఎకనామిక్ డైలీ కథనం ప్రకారం తెలిసిందేంటంటే..ఆపిల్‌ ప్రస్తుతం వాహన వీడిభాగాల సరఫరా కోసం పలు కంపెనీలు ఎంచుకుంటుందని తెలపడం జరిగింది.ఇక గతంలో ఆపిల్‌ పలు ఆటోమొబైల్‌ దిగ్గజ కంపెనీలు అయినా బీఎమ్‌డబ్ల్యూ, హ్యుందాయ్, నిస్సాన్ ఇంకా టయోటాలను సంప్రదించడం జరిగింది.అలాగే ఉమ్మడిగా ఎలక్ట్రిక్‌ వాహనాలను కూడా ప్లాన్‌ చేయడం కోసం ఒప్పందాలను కుదుర్చుకోవాలని భావించడం జరిగింది.

ఇక ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ భాగంగా ఆపిల్‌ కంపెనీ ప్రస్తుతం రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ (ఆర్‌ఎఫ్‌ఐ), రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పి) ఇంకా రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ (ఆర్‌ఎఫ్‌క్యూ) లను గ్లోబల్ ఆటోమొబైల్ పార్ట్ తయారీదారులకు పంపే ప్రక్రియను కూడా పూర్తి చేసినట్లు సమాచారం తెలుస్తోంది. ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చెయ్యడంలో భాగంగా ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రొడక్షన్‌, స్టీరింగ్, డైనమిక్స్, సాఫ్ట్‌వేర్ ఇంకా అలాగే ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో అనుభవం ఉన్న ఇద్దరు మాజీ మెర్సిడెస్ ఇంజనీర్లను ఆపిల్‌ కంపెనీ  నియమించడం జరిగింది.ఇక ప్రస్తుతం వీరు ఆపిల్‌ కంపెనీ స్పెషల్‌ ప్రాజెక్ట్‌ గ్రూప్‌లో ప్రొడక్ట్‌ డిజైన్‌ ఇంజనీర్‌లుగా పనిచేస్తున్నట్లు సమాచారం అనేది తెలుస్తోంది.

ఇక అలాగే ప్రముఖ ఆపిల్‌ ప్రొడక్ట్స్ విశ్లేషకుడు మిండ్‌-చికుయో 2025-2027 వరకు కూడా ఆపిల్‌ కార్ల విడుదల అవకాశం లేదని పేర్కొనడం జరిగింది.ఇక అంతేకాకుండా ఆపిల్‌ కంపెనీ కార్ల లాంచ్‌ మరింత ఆలస్యమైనా కాని ఆశ్చర్యపోనవసరం లేదని అభిప్రాయపడటం జరిగింది.ఇక ఆపిల్‌ కంపెనీ ఎలక్ట్రిక్‌ కార్ల ప్రాజెక్ట్‌ హెడ్‌ డౌగ్‌ ఫీల్డ్‌ కంపెనీ విడిచిపెట్టి ఫోర్డ్‌ మోటర్స్‌లో చీఫ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ ఇంకా ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ ఆఫీసర్‌గా జాయిన్‌ కాబోతున్నాడు.ఇక దీంతో ఆపిల్‌ కంపెనీకు ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ విషయంలో గట్టి దెబ్బ అనేది తగిలినట్లుగా నిపుణుల విశ్లేశించడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: