ఫోర్స్ గుర్ఖా ఆఫ్ రోడర్ విడుదలయ్యేది ఎప్పుడంటే?

ఫేమస్ ఇండియా ఆటోమొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ కార్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త ఫోర్స్ గుర్ఖా  ఎస్‌యూవీ కార్ విడుదల తేదీని కంపెనీ అధికారికంగా వెల్లడించడం జరిగింది. ఇక సెప్టెంబర్ 20వ తేదీన ఫోర్స్ మోటార్స్ తమ సరికొత్త 2021 ఫోర్స్ గుర్ఖా కార్ ని ఇండియా మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది.ఇక ఈ కొత్త ఫోర్స్ గుర్ఖా ఎస్యూవీ కార్ లో కంపెనీ అనేక డిజైన్ ఇంకా ఫీచర్ అప్‌గ్రేడ్ లను చేయడం జరిగింది. ఇక అంతేకాకుండా ఈ కార్ మునుపటి కన్నా కూడా మరింత క్లీన్ ఇంజన్ తో మార్కెట్లోకి రాబోతుంది.ఇక ఈ కారులో బిఎస్6 ఇంజన్ అప్‌గ్రేడ్ తో పాటుగా దాని స్టైలింగ్ ఇంకా సేఫ్టీ ఫీచర్లలో కూడా కంపెనీ పలు మార్పులు చేర్పులు చేయడం జరిగింది.ఇక ఫోర్స్ మోటార్స్ తమ నెక్స్ట్ జనరేషన్ గుర్ఖా ఎస్‌యూవీ కార్ కాన్సెప్ట్ ను గత సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించడం జరిగింది. 

ఇక నిజానికి ఈ మోడల్ ఎప్పుడో మార్కెట్లో విడుదల కావల్సి ఉంది. కాకపోతే ఇండియానే కాకుండా యావత్ ప్రపంచాన్ని కుదిపివేసిన కోవిడ్-19 సంక్షోభం వల్ల ఇది చాలా కాలంగా వాయిదా పడుతూ రావడం జరిగింది.అయితే ఇక ఇప్పుడు ఈ కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ కార్ విడుదలకు ముహుర్తం అనేది ఫైనల్ అయ్యింది. ఇక ఈ నెల 20 వ తేదీన ఈ కార్ మార్కెట్లో సందడి చేయబోతుంది. అలాగే మహీంద్రా కంపెనీ ప్రవేశపెట్టిన తమ కొత్త తరం 2020 మహీంద్రా థార్ ఎస్‌యూవీ కార్ మాదిరిగానే ఈ కొత్త తరం ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ కార్ కుడా ఇటు ఆన్-రోడ్ ఇంకా అటు ఆఫ్-రోడ్ ప్రయోజనాల కోసం రూపొందించినట్లుగా తెలుస్తుంది.ఇక అప్‌డేట్ చేయబడిన ఈ కొత్త 2021 ఫోర్స్ గుర్ఖ ఎస్‌యూవీ కార్ లో మెర్సిడెస్ బెంజ్ నుండి గ్రహించిన 2.6 లీటర్ డీజిల్ ఇంజన్ ను ఉపయోగించడం జరిగింది. ఈ బిఎస్6 వెర్షన్ ఇంజన్ ఎక్కువగా 89 బిహెచ్‌పి పవర్ ను ఇంకా 260 ఎన్ ఎమ్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుందని సమాచారం.ఇక అలాగే ఇది మాన్యువల్ 4x4 సిస్టమ్ ఇంకా స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మార్కెట్లోకి రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: