ఐఫోన్ 13 కాదు 14 అంటు ట్రెండ్‌.. కార‌ణం అదేనా?

ప్రపంచ వ్యాప్తంగా ఆపిల్ ఫోన్ల కు భారీ డిమాండ్ ఉంటుంది. ఆపిల్ ఫోన్లు అంటేనే యువ‌తకు క్రేజే వేరు. ఆ సంస్థ ఎలాంటి మొబైల్ విడుద‌ల చేసినా అది వ‌రల్డ్ లోనే టాప్ సెలింగ్ లో ఉంటుంది. ఆ ఫోన్ల ను ప్ర‌జ‌లు ఎగ‌బ‌డి కొంటారు. దాని ధ‌ర ల‌క్ష‌ల‌ల్లో ఉన్న లెక్క చేయ‌రు. అలాంటి క్రేజ్ కేవ‌లం ఆపిల్ మొబైల్స్ కే సాధ్యం. గ‌తంలోనే ఆపిల్ సంస్థ ఐఫోన్ 12 ను విడుద‌ల చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచంలోనే ఎక్కువ ఫోన్లు అమ్మిన ఫోన్‌గా టాప్ లో ఉంది. దీని త‌ర్వాత ఐఫోన్ 13 కోసం ఆపిల్ అభిమానులు కళ్ల ల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే ఆపిల్ అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న ఐఫోన్ 13 ను కాలిఫోర్నియా వేదిక‌గా ఈ సెప్టెంబ‌ర్ 14న విడుద‌ల చేయ‌డానికి ఆపిల్ కంపనీ వారు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆపిల్ అభిమానుల కోసం ఏకంగా ఐఫోన్ 13 రిలిజ్ ఈవెంట్ ను ప్ర‌త్యేక్ష ప్ర‌సారం చేయ‌నుంన్నారు.

అయితే ట్వీట్ట‌ర్ లో ఆపిల్ అభిమానులు ఐఫోన్ 13 కాద‌ని అది ఐఫోన్ 14 అంటూ ట్వీట్ లు చేస్తున్నారు. ఆపిల్ సంస్థ ఐఫోన్ 14నే విడుద‌ల చేస్తున్నార‌ని ట్వీట్ట‌ర్ లో ట్రెండింగ్ చేస్తున్నారు. అభిమానులు #iPhone14 పేరిట ట్వీట్ట‌ర్ లో ట్రెండ్ చేస్తున్నారు. దీనికి కార‌ణం కొన్ని దేశాల ప్ర‌జ‌లు 13 అనే నంబ‌ర్ ను దుర‌దృష్ట‌క‌ర సంఖ్య గా భావిస్తారు.  ఈ 13 సంఖ్య‌నే చాలా ప్ర‌దేశాల్లో వాడ‌రు. కొన్ని విమానాల్లో, కొన్ని అపార్ట్ మెంట్ ల‌లో 13 వ నెంబ‌ర్ తో ఉన్న దాన్ని అస‌లు వాడ‌రు. ఈ సంఖ్య త‌మ‌కు కీడు చేస్తుంద‌ని వారి మూఢ‌న‌మ్మ‌కం. అందుకు గాను ట్వీట్ట‌ర్ లో ఐఫోన్ 14 విడుద‌ల చేస్తోంద‌ని ప్ర‌చారం చేస్తున్నారు.

కానీ ఆపిల్ సంస్థ వారు 13 నెంబ‌ర్ కీడు చేస్తుంది అనేది మూఢ న‌మ్మ‌క‌మ‌ని కొట్టి పారేసింది. తాము సెప్టెంబ‌ర్ 14 న ఐఫోన్ 13 నే విడుద‌ల చేసి తీరుతామ‌ని తెల్చి చేప్పారు. ఇలాంటి వింత ప‌రిస్థితి గ‌తంలోనూ ఆపిల్ సంస్థకు ఎద‌రైంద‌ని వారు గుర్తుచేశారు. 2010లో ఐఫోన్ 4 విడుద‌ల చేయ‌డానికి ఇలాంటి ప‌రిస్థితులే వ‌చ్చాయ‌ని అన్నారు. 4 అనే సంఖ్య‌ను చైనా తో పాటు మ‌రికొన్ని ఆసియా దేశాల‌ల్లో మ‌ర‌ణానికి సూచిక‌గా భావిస్తారు. అయినా ఐఫోన్ 4 ను విడుద‌ల చేసింది. అప్పుడు కొన్ని గుణాంకాల ప్ర‌కారం గ‌తం కంటు ఐఫోన్ మొబైల్స్ ఎక్కువ‌గా అమ్ము పోయాయ‌ని ఆ సంస్థ ప్ర‌తినిదులు తెలిపారు. ఇప్పుడు కూడా తాము ఐఫోన్ 13 ను విడుద‌ల చేసి తీరుతామ‌ని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: