బుల్లి పిట్ట : దగ్గండి.. జబ్బేంటో చెప్తామంటున్న యాప్..!

Divya
ప్రజలకి ఎప్పుడు ఎలాంటి వ్యాధి వస్తుందో మనం చెప్పలేము. అయితే ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ ప్రకారం ఒక యాప్ ను కనిపెట్టారు ..యాప్ లో దగ్గితే చాలు.. ఆ దగ్గిన వ్యక్తికి ఉన్న వ్యాధి ఏంటో కనిపెట్టేస్తుంది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.

ఈ యాప్ ను అమెరికాకు చెందిన ఒక సంస్థ ఇటువంటి టెక్నాలజీ ని కనిపెట్టింది. మరి ఆ కంపెనీ చెబుతున్న విషయం ప్రకారం ఆ యాప్ ఎలా పని చేస్తుందో చూద్దాం.
అమెరికన్ శాస్త్రవేత్తలు తెలిపిన ప్రకారం ఒక వ్యక్తి ఈ యాప్ కు దగ్గర చేసే దగ్గు శబ్దాన్ని బట్టి అతను ఏ వ్యాధితో బాధపడుతున్నారో చెప్పేలా రూపొందించారు. ఈ యాప్ ని వివిధ రకాలైన వ్యాధులను గుర్తించే విధంగా అనేకరకాలైన దగ్గు వాయిస్ లను చేర్చారు. అందుచేతనే ఇది ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుందని అమెరికాకు చెందిన హై ఫై కంపెనీ చెబుతోంది. భవిష్యత్తులో రాబోయే ఉబ్బసం, నిమోనియా వంటి వ్యాధులు కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని తెలియజేస్తున్నారు పరిశోధకులు.
ఈ యాప్ ను తయారు చేసిన కంపెనీ చీఫ్ మెడికల్ ఆఫీసర్, tb నిపుణుడైన డాక్టర్ పీటర్ స్మాల్ ఇలా తెలియ జేస్తున్నారు.. దగ్గు శబ్దం అనేది వివిధ వ్యాధుల కారణంగా మారుతూ ఉంటుందని తెలియజేశాడు. ఎవరైనా ఆస్తమాతో బాధపడుతున్నట్లయితే.. అతని శ్వాస లోని దగ్గు ఒక రకమైన ఊపిరి గా ఉంటుంది అని తెలియజేశాడు. ఒకవేళ మిమ్మల్ని సోకిన రోగి అయితే దగ్గు ఊపిరితిత్తుల నుండి  విభిన్నమైన ధ్వని వినిపిస్తుంది అని తెలియజేశాడు.
పరిశోధనల ప్రకారం ఈ అధ్యయనం స్పెయిన్ లో జరుగుతున్నది.. ఈ యాప్ ను మన మొబైల్స్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చట... ఈ యాప్ ఎటువంటి శబ్దాలకు ఎలా స్పందిస్తుందో అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ యాప్ ను పూర్తిగా సెట్ చేసిన తర్వాత సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఏది ఏమైనా ఇలాంటి టెక్నాలజీ రావడం వల్ల రాబోయే కాలంలో డాక్టర్ల దగ్గరికి వెళ్లాల్సిన పని ఉండదేమో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: