ఆత్మ‌హ‌త్య‌ల‌ను టెక్నాల‌జీ నిలువ‌రిస్తుందా..?

Paloji Vinay
ఎంతో జీవితం ఉన్నా కొంద‌రు తొంద‌ర‌పాటు త‌నం వ‌ల్ల త‌మ జీవితాల‌ను అర్థాంత‌రంగా ముగించుకుంటున్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను, ఇబ్బందుల నుంచి త‌ప్పించుకునేందుకు ఆత్మ‌హ‌త్య‌ను బాట‌గా చేసుకుంటున్నారు. ఎన్ సీ ఆర్ బీ (నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో) రిపోర్టు ప్రకారం ఒక్క 2019లోనే దాదాపు లక్షా నలభై వేల మంది భారతీయులు ఆత్మహత్యలకు చేసుకున్నారు. అంటే ఈ లెక్క‌న‌ సగటున రోజుకు 381 మంది ప్రాణాలు వ‌దిలేసారు. మన చుట్టుపక్కలో, మనకి తెలిసినవారో, మనవారో ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిసినా దానిపై స్పందిచ‌డానికి చాలా మంది ముందుకు రారు.

     ఆత్మహత్యలకు పాల్పడకుండా అవగాహన క‌లిగించ‌డానికి ప్రతీ సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ 10 వ తేదిన  `ప్ర‌పంచ ఆత్మ‌హ‌త్యల నివార‌ణ` దినోత్స‌వంగా జ‌రుపుకుంటారు. ఆ సందర్భంగా  ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌లను ప‌సిగ‌ట్టి వాటిని అడ్డుకోవ‌డంలో సాంకేతిక‌త పాత్ర ఎంత ఉంది అని తెలుసుకుందాం.

ఆత్మహత్యల నివారణలో ఈ అంశాలు సహాయం చేస్తాయి.
   ఆత్మహత్య చేసుకోవాలనో, తమకు తాము హాని చేసుకోవాలనో అనే ఆలోచ‌న వ‌స్తున్న వారికి టెక్నాల‌జీ ఇప్ప‌టికే సాయం అందిస్తోంది. దీని కోసం 24 గంట‌ల పాటు సూసైడ్ హాట్లైన్లు పనిజేస్తున్నాయి.  ఆత్మహత్య చేసుకోవడం అనే అంశం గురించి ఏదైనా సెర్చ్ చేయగానే ముందు ఆయా దేశాల హాట్లైన్ నెంబర్లు చూపిస్తుంది గూగుల్ సెర్చ్ ఇంజన్. అదే విధంగా ఆత్మ‌హ‌త్య‌ల నివార‌ణ‌పై అవ‌గాహ‌న క‌లిగించేందుకు చేస్తున్న ప్ర‌చారాలు ఈమెయిల్‌, సామాజిక మాధ్య‌మాల ద్వారా చేరుతున్నాయి.

ఆత్మహత్యా ఆలోచనలని, ప్రవర్తనని పసిగట్టడానికి స్మార్ట్ ఫోన్ల లో ఉన్న సాంకేతిక‌త ఉప‌యోగ‌ప‌డుతోంది. స్నేహితులకు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండడం, తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా ఒంటరిగా ఉండడం అనే ల‌క్ష‌ణాలు ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారిలో సాధారణంగా ఉంటాయి. అంటే, ఒక మనిషి మిగతావారితో ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేది తెలుసుకుంటే ఆత్మ‌హ‌త్య చేసుకునే అవ‌కాశాలు తెలుసుకోవ‌చ్చు. దీని ఆధారంగా  ఒక మొబైల్ యాప్ కనుగొన్నారు కొంద‌రు ప‌రిశోద‌కులు. ఇది నిర్ధారిత సమయానికి చుట్టుపక్కల ఉన్న డివైజ్‌ల‌ను బ్లూటూత్ ద్వారా గుర్తించి ఆ సమాచారాన్ని సర్వర్‌కు అందిస్తుంది.  దీని ద్వారా ఉన్న స‌మాచారం ప‌రిశీలించ‌డం వ‌ల్ల ఒక మ‌నిషి త‌న ప్ర‌వ‌ర్త‌న తీరులో మార్పులు వ‌స్తే అది తెలియ‌జేస్తుంది.

    సోషల్ మీడియాలో స్టేటస్‌ల  ద్వారా వారి ఆలోచ‌న‌లు  విశ్లేషణ చేయ‌వ‌చ్చు. అలాగే ముఖ‌క‌వ‌ళిక‌లు, మాట విధానాన్ని కంప్యూట‌ర్ ద్వారా అన‌లైజ్ చేయ‌డం, సైకియార్టిస్ట్ ల ద్వార‌ వారి ఆలోచ‌న విధానం తెలిసిపోతుంది. దీని ద్వారా కొంత‌లో కొంత ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునే వారిని నిలువ‌రించ‌వ‌చ్చు అని నిపుణులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: