బుల్లి పిట్ట: మొబైల్ నెంబర్ లింకు లేకున్నా.. ఆధార్ కార్డు ను ఇలా డౌన్లోడ్ చేయండి..!

Divya
ఆధార్ కార్డ్ ప్రస్తుతం ప్రతి ఒక్కరికి అవసరం. ఇప్పుడు ఏదైనా ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలంటే ఈ ఆధార్ కార్డ్ తప్పని సరిగా మారిపోయింది. మనం ఏదైనా ప్రభుత్వ పథకాలకు అర్హులు కావాలంటే కచ్చితంగా ఈ కార్డు ఉండాల్సిందే. అంతేకాకుండా చిన్నపిల్లలను స్కూల్ కి చేర్చాలన్న, మనం ఏవైనా టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా.. ఈ ఆధార్ కార్డ్ కంపల్సరిగా మారిపోయింది.
అయితే ఒకవేళ మీ ఆధార్ కార్డు పోగొట్టుకున్నట్లు అయితే.. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆధార్ కార్డు ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.

ఈ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ ను లింక్  చేయకపోతే ఆధార్ కార్డు మనం డౌన్లోడ్ చేసుకోలేమని అనుకుంటారు కొందరు. అయితే అదంతా అపోహ మాత్రమే. మీ ఆధార్ కార్డు కు మీ మొబైల్ నెంబర్ లింక్ చేయకపోయినా ఆధార్ కార్డును ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
1). ముందుగా  గూగుల్ సెర్చ్ లో  UIDAI అని టైప్ చేసి.. ఓపెన్ చేయాలి.

2). అలా ఓపెన్ చేసిన అనంతరం..ORDER AADHAAR CARD REPRIENT అనే ఆప్షన్ పైన ఓకే చేయవలసి ఉంటుంది.

3). ఇక ఆ తరువాత మన ఆధార్ కార్డు యొక్క 12 అంకెలు నెంబర్ ను లేదా.. 16 అంకెల వర్చువల్ ఐడి ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత సెక్యూరిటీ కోడ్ మీద చూపించిన వాటిని ఎంటర్ చేయాలి.

4). ఆ తర్వాత అక్కడ MY mobile నెంబర్ ఈస్ నాట్ రిజిస్టర్డ్.. అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి.
5). అలా ఎంటర్ చేసుకున్న తర్వాత సెండ్ ఓటిపి పైన క్లిక్ చేయాలి.
6). ఇక ఆ తర్వాత..TERMS AND CONDITIONS అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి , ఆ తర్వాత.. సబ్మిట్ బటన్ మీద ఓకే చేయాలి.
7). ఆ తర్వాత ఓటిపి నెంబర్ ను నమోదు చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత PREVIEW AADHAAR letter పైన క్లిక్ చేయాలి.

8). చివరిగా పేమెంట్ పూర్తి చేసుకున్న తర్వాత మీ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: