వాట్సప్ లో కావలసినప్పుడు "డిలీట్ ఫర్ ఎవ్రీ వన్"... ఎలా అంటే ?

Vimalatha
ప్రస్తుతమున్న టెక్నాలజీ యుగంలో మెసేజింగ్ ప్ వాట్సాప్ ని ఉపయోగించని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. టీనేజ్ పిల్లల నుంచి వృద్ధుల దాకా అందరూ వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. అయితే యూజర్ అవతలి వారి కోసం పంపిన సందేశాన్ని ఒక గంటలోపు ఇద్దరికీ కన్పించకుండా "డిలీట్ ఫర్ ఎవ్రీ వన్" అనే ఆప్షన్ తో తొలగించవచ్చు. అయితే కేవలం గంట వ్యవధి వరకే ఉంటుంది. ఆ తరువాత మాత్రం కన్పించదు. పొరపాటున ఏదైనా మెసేజ్ పెట్టి మర్చిపోతే ఆ తర్వాత దాన్ని డిలీట్ చేయడం కష్టం. అయితే ఓ చిన్న ట్రిక్ పాటిస్తే గంట తర్వాత కూడా అవతలి వారికి కనిపించకుండా మెసేజ్ లు డిలీట్ చేయవచ్చు. మీరు మెసేజ్ లు అలా డిలీట్ చేయాలంటే ఆ మెసేజ్ వెళ్లి గంట కాలేదని వాట్సప్ ను నమ్మించాలి. దాని కోసం ఫోన్ సమయాన్ని మార్చాలి.
ఉదాహరణకు మీరు మీ ఫ్రెండ్ కు ఉదయం పది గంటలకు మెసేజ్ పెట్టారనే అనుకుందాం. ఆ మెసేజ్ పంపించి నాలుగు గంటలకు పైగా అయింది. అంటే ఇప్పుడు సమయం మధ్యాహ్నం 2:00. అప్పుడు ఆ మెసేజ్ లు తొలగించలేము. కానీ మీ ఫోన్లో ఫ్లైట్ మోడ్ ని ఆన్ చేసి వాట్సాప్ ఐకాన్ ని పట్టుకొని గట్టిగా నొక్కాలి. ఆ తర్వాత వాట్సాప్ మెసేజ్ లు అన్ ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు యాప్ సమాచారం పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఫోర్స్ క్లోజ్ లేదా ఫోర్స్ స్టాఫ్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ సెట్టింగ్ లోకి వెళ్లి సమయాన్ని మార్చాలి. మీరు మెసేజ్ పంపిన సమయాన్ని ముందుకు సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఎవరి మెసేజ్ ను తొలగించాలి అనుకుంటున్నారో వారి చాట్ కి వెళ్లి అక్కడ మీరు అనుకున్న మెసేజ్ డిలీట్ చేయొచ్చు. ఆ తర్వాత ఫోను మళ్లీ ఫ్లైట్ మోడ్ లో నుంచి తీసేసి ఫోన్ తేదీ, సమయాన్ని మార్చుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: