వాట్సాప్‌లో ఉండే ఈ ఫీచర్ మీకు తెలుసా?

Suma Kallamadi
స్మార్ట్ ఫోన్ ఉన్నప్రతీ ఒక్కరు వాడే యాప్స్‌లో తప్పక ఉండేది ‘వాట్సాప్’. ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపులర్ అయిన మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు బోలెడు మంది కస్టమర్స్ ఉన్నారు. అప్పట్లో ప్రైవసీ పాలసీ తీసుకొస్తున్నట్లు వాట్సాప్ సంస్థ తెలిపింది. అయితే, దానితో వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందన్న ప్రచారం కాగా, వాట్సాప్ సంస్థ ప్రైవసీ పాలసీ వాయిదా వేసింది. కాగా, మెసేజింగ్‌కు దాదాపు అందరు వాడే యాప్ ‘వాట్సాపే’ అని చెప్పొచ్చు. 

ఇకపోతే వాట్సాప్ వాడుతున్న క్రమంలో మనకు వచ్చేటువంటి ప్రతీ మెసేజ్ చూడాలంటే ప్రతీ సారి చాట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్ కాంటాక్ట్ ఓపెన్ చేస్తేనే మెసేజ్ చదవచ్చు. వాట్సాప్ యాప్ ఓపెన్ చేయకుండానే మీకు వచ్చిన సందేశాన్ని చదవొచ్చు.. ఎలాగంటే.. వాట్సాప్ హోం స్క్రీన్‌పై లాంగ్ ప్రెస్ చేయండి.. మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్, మెనూ పాప్‌ అప్ అవుతుంది. అప్పుడు విడ్జెట్స్‌పై ట్యాప్ చేస్తే మీకు షార్ట్ కట్ కనిపిస్తుంది. అలా మీరు వాట్సాప్ షార్ట్‌ కట్ ఉపయోగించి వాట్సాప్ యూజ్ చేయొచ్చు. ఇకపోతే వాట్సాప్‌లో మీకు వేర్వేరు విడ్జెట్స్ కూడా కనిపిస్తాయి. అందులో మీరు 4 x 1 వాట్సాప్ విడ్జెట్ సెలక్ట్ చేసుకోవచ్చు.


టచ్ చేసి హోల్డ్ చేయడం ద్వారా ఆ విడ్జెట్ మీ హోం స్క్రీన్లలో ఒక దానికి డ్రాప్ అవుతుంది. ఇలా చేయడం ద్వారా వాట్సాప్ చాట్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదిక. మీ వాట్సాప్‌కు ఏదైనా మెసేజ్ వచ్చినా ఓపెన్ చేయకుండానే చూడొచ్చు. పాత సందేశాలే కాదు. కొత్త సందేశాలు మీరు చదివేయొచ్చు. అయితే, విడ్జెట్‌పై మీరు ఏదేని చాట్ ఓపెన్ చేస్తే మెసేజ్ ఓపెన్ చేసినట్లుగా యూజర్‌కు తెలిసిపోతుంది. ఇక వాట్సాప్ వెబ్ గురించి అందరికీ విదితమే. డెస్క్ టాప్ వర్షన్‌లో వాట్సాప్ యాప్‌ను ఇలా మీరు ఓపెన్ చేయొచ్చు. వాట్సాప్ డాట్ వెబ్ డాట్ కామ్ ద్వారా క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు డెస్క్ టాప్ మోడ్‌లో వాట్సాప్ ఓపెన్ చేసుకుని కావాల్సిన మెసేజెస్ చదువుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: