కరోనా పనిపట్టే పరికరం సిద్ధం..

కరోనా మహమ్మారి చాలా దారుణంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే.ప్రపంచవ్యాప్తంగా ఎందరినో బలి తీసుకుంది. ఇంకా దీని ప్రభావం అస్సలు తగ్గడం లేదు. మళ్ళీ థర్డ్ వేవ్ అనేది రాబోతుంది.ఇక తాజాగా కరోనా మహమ్మారిని చంపగలిగే ఒక పరికరాన్ని ఇటలీలో కనుగొన్నారని సమాచారం అందింది.ఇది ఒక లేజర్ పరికరం. ఇక ఈ పరికరం గాలిలోనూ అలాగే గోడమీదా ఉన్న కరోనా వైరస్ పని పడుతుందని అక్కడి పరిశోధకులు అంటున్నారు.ఇక ఈ పరికరాన్ని ఐక్యరాజ్యసమితి శాస్త్రవేత్తలు ఇటాలియన్ టెక్ సంస్థ శాస్త్రవేత్తల సహకారంతో తయారు చేయడం జరిగింది.ఇక ఉత్తర ఇటాలియన్ నగరమైన ట్రీస్టేలో ఉన్న ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ, ఈ లేజర్ పరికరాలను తయారుచేసే లోకల్ సంస్థ ఆల్టెక్ కె-లేజర్ గత సంవత్సరం ఇటలీ కరోనా మహమ్మారితో పోరాడుతున్నప్పుడు ఈ ప్రయత్నాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక ఆల్టెక్ సంస్థ చైర్మన్ ఫ్రాన్సిస్కో జనతా తన సంస్థ వైద్య రంగంలో ఉపయోగించే లేజర్ ఉత్పత్తులను తయారు చేయడం జరిగింది.

ఇక ఈ పరికరం కరోనా వైరస్ ఇంకా బాక్టీరియాని 50 మిల్లీ సెకన్ల లోపులోనే చంపేస్తుందట. “ఇక ఈ పరికరం నేను లేజర్ టెక్నాలజీ గురించి ఆలోచించే విధానాన్ని పూర్తిగా మార్చివేయడం జరిగింది. ఈ పరికరం 50 మిల్లీసెకన్లలో అనేక వైరస్లను చంపుతుంది” అని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీలో కార్డియోవాస్కులర్ బయాలజీ గ్రూప్ హెడ్ సెరెనా జాకిన్యా చెప్పడం జరిగింది.ఇక ఈ లేజర్ ఆధారిత టెక్నాలజీ కాంతివలయ వైరస్ చంపడానికి సురక్షితంగా కాదని ఈ పరికరం గురించి పలువురు శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. అయితే,  గత సంవత్సరం నవంబర్‌లో జర్నల్ ఆఫ్ ఫోటోకెమిస్ట్రీ అండ్ ఫోటోబయాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం క్యాన్సర్ ప్రమాదానికి ఒక కారణంగా లేజర్ ఆధారిత పరికరాలను తెలిపడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: