బుల్లి పిట్ట: రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త..

Divya
నిరుపేదల కోసం ప్రభుత్వలు ఆహార పథకం కింద రేషన్ కార్డు ను విడుదల చేశాయి. ఇక ఈ రేషన్ కార్డులు అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రేషన్ కార్డు వల్ల ఎంతో మంది ప్రజలకు ఆహార ధాన్యాలు అందుతున్నాయి. అయితే ఇప్పుడు  ప్రజల కోసం ఒక మంచి  వెసులుబాటు కలిపించే ఒక ఆప్షన్  అమల్లోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ పథకం విశేషాలను తెలుసుకుందాం.
ఎన్నో కోట్ల మంది లబ్ధి పొందుతున్న ఈ రేషన్ కార్డ్ ల  కోసం ప్రభుత్వం ఒక కొత్త యాప్ ను తీసుకు వచ్చింది. ఈ యాప్ ద్వారా ప్రజలు ఎక్కడి నుంచైనా తమ రేషన్ సరుకులను తీసుకోవచ్చట. ఒకవేళ మనకు షాప్ ఎంత దూరంలో ఉన్న కూడా ఇందులో చుపిస్తుందట. ఈ యాప్ పేరు ఏమిటంటే"MERA RATION"అనే యాప్ ను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.
ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్న ప్రతి ఒక్కరూ..ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఈ యాప్ యొక్క విశేషాలు ఏమిటంటే, మన చుట్టూ ఎన్ని రేషన్ షాపులు ఉన్నాయి దాని వివరాలు తెలుసుకునే విధంగా ఈ సదుపాయాన్ని కల్పించింది ప్రభుత్వం.
ఈ యాప్ ను ముందుగా ఉపయోగించుకోవాలంటే, మనం మన మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, మన రేషన్ కార్డు యొక్క నెంబర్ తో ఈ యాప్ లో రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. తద్వారా మనకి మన చుట్టూ ఉన్న రేషన్ షాప్ నెంబర్ లు, ఏ ఏరియాలో ఉన్నది, ఎంత డిస్టెన్స్ లో ఉన్నది కూడా చూపించగలదు. దీని ద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతే కాదు రేషన్ తీసుకునే వారికి మరింత సౌలభ్యంగా ఉంటుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: