సరికొత్త హంగులతో 'హల్లో యాప్‌'...!

Suma Kallamadi
ప్రస్తుతం చాలా మంది బయట ప్రపంచంలో కంటే కూడా సోషల్ మీడియా వరల్డ్‌లోనే ఎక్కువగా జీవిస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే, అన్ని యాప్స్ వెంటనే దిగ్గజాలయ్యే చాన్స్ ఉండదు. వాటికి అవిగా పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుని యూజర్స్‌ను అట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కొత్తగా వచ్చిన సోషల్ మీడియాలో హల్లోయాప్‌ను నీరజ్ అరోరా, మైఖేల్ డోనూ రూపొందించారు. భద్రతా,  ట్రోలింగ్ పరిమితులు ఈ యాప్ ద్వారా లభిస్తాయని వారు పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం యాప్‌నకు మరిన్ని ఫీచర్స్ యాడ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు.

ఈ హల్లో యాప్ ఇన్‌స్టాలేషన్ ప్లస్ అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా మొబైల్ ఫోన్‌లోని కాంటాక్ట్స్ అందరితో ఆటోమేటిక్‌గా సంభాషించొచ్చు. కాగా, ఈ యాప్ దిగ్గజ యాప్ అయిన వాట్సాప్‌తో పోటీకి దించుతున్నట్లు తెలుస్తోంది. అందుకు గాను రకరకాల ఫీచర్స్, సరికొత్త హంగులు అద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ‘హల్లోయాప్’నకు ‘టెలిగ్రాం, సిగ్నల్’ వంటి కంపెనీల నుంచి పోటీ ఉంటున్నది. అయితే, హల్లోయాప్‌లో ఇతర యాప్‌ల మాదిరి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపడం, యాక్సెప్ట్ చేయాలని అడగడం ఉండదు. యాప్‌లో చేరితే చాలు..ఆటో‌మేటిక్‌గా కాంటాక్ట్స్ అందరికీ ఫ్రెండ్స్ అవుతారట. ఈ నేపథ్యంలోనే అందరి పోస్టులను ఈజీగా చూడొచ్చు. ఇకపోతే ఈ యాప్ కోసం ప్లే స్టోర్‌లో ఇంగ్లిష్ భాషలో హల్లోయాప్(HalloApp) అని రెండు పదాలను కలిపి సెర్చ్ చేయాలి. యాప్ ఓపెన్ అయ్యాక మొబైల్ నెంబర్ ఇస్తే చాలు..ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేశాక మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత యాప్‌ను యూజ్ చేసుకోవచ్చు. దీనికి కూడా ఇతర యాప్‌ల మాదిరి ఫోన్ పర్మిషన్స్ గ్రాంట్ చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవసీ అతిముఖ్యం. కాబట్టి యూజర్ల నుంచి ఎలాంటి సమాచారం తీసుకోవడం లేదని సంస్థ వ్యవస్థాపకులు చెప్తున్నారు. తమ యాప్ వర్కింగ్‌ను ఇష్టపడే మరికొంత మంది యూజర్స్ ప్రతీ రోజు అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారని, అందరికీ నచ్చేలా మరిన్ని ఫీచర్స్ రూపొందిస్తామని సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: