బుల్లి పిట్ట: చెమటతో మొబైల్ ఛార్జింగ్... ఎలా అంటే !

Divya
ప్రతిరోజు ఏదో ఒకటి కొత్త టెక్నాలజీని కనుక్కుంటూనే ఉన్నారు మన శాస్త్రవేత్తలు. ఇక మొన్ననే గాలి లో ఎగిరే కారును కూడా కనిపెట్టారు. అంతేకాకుండా నీటితో నడవగలిగే వాహనాలను కూడా కనిపెట్టారు. ఇలాంటి సరికొత్త టెక్నాలజీతో మన ముందుకు వచ్చిన శాస్త్రవేత్తలు.. ఇప్పుడు మొబైల్ కు ఛార్జింగ్ ను మానవుని శరీరం నుంచి వెలువడే చెమట ద్వారా మొబైల్ కు ఛార్జింగ్ చేసే విధానాన్ని కనుగొన్నారు.

ఇలా సరికొత్త పరికరం ద్వారా మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కరెంట్ అవసరం లేకుండా,చాలా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. ఈ పరికరాన్ని ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. పైన చూపిన విధంగా చేతి వేళ్ళకి తెల్లటి ప్లాస్టర్ మాదిరిగా  ఉన్న దానిని మన చేతి వేళ్ళకు చుట్టుకోవాల్సి  ఉంటుంది. మనము రాత్రిపూట నిద్రించేటప్పుడు, ఎప్పుడైనా ఖాళీ సమయంలో కూర్చున్నప్పుడు, వచ్చే చెమట నుండి విద్యుత్ ఉత్పత్తి అవుతుందట.

అలా ఉత్పత్తి అవుతున్న విద్యుత్తుతో మొబైల్ ఛార్జింగ్ చేసుకోవచ్చట. చిన్న పరిమాణంలో ఉంటున్న ఈ పరికరం లో కార్బన్ నురుగు అలాగే ఎలక్ట్రోడ్ చిప్ అమర్చబడి ఉంటుంది. మన శరీరం నుంచి వెలువడే చెమట ద్వారా, కార్బన్ నురుగు సహాయంతో ఎలక్ట్రోడ్ లు, ఎంజైమ్లు కణాల మధ్య చర్య జరిగి, విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. అలా ఉత్పత్తి అవుతున్నప్పుడు ఎలక్ట్రోడ్ కింద ఉన్న ఒక చిన్న చిప్ ను  నొక్కినట్లయితే అది శక్తిగా మారుతుంది.
ప్రస్తుతం ఇప్పుడు ఒక మొబైల్ కి ఛార్జింగ్ చేసేందుకు మూడు వారాల సమయం పడుతోందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. రాబోయే రోజుల్లో దీని సామర్థ్యాన్ని పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఇక దీనిని ఎవరు కనుగొన్నారు అంటే అమెరికా లోని శాన్ డియాగో లో ఉన్న కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి సంబంధించిన శాస్త్రవేత్తలు ఈ పరికరాన్ని కనుగొనడం జరిగింది. ఇక ఈ శాస్త్రవేత్తలు జరిపిన మరొక అధ్యయనం ఏమిటంటే, ఒక వేలికి మాత్రమే పది గంటల పాటు ధరించినప్పుడు, 24 గంటలకు అవసరమయ్యే విద్యుత్ ఛార్జ్ ను నిలువ చేయగలిగిందట. అయితే అన్ని వేలకు దీనిని ధరించడం వల్ల ఎక్కువ శక్తి ఉత్పత్తి అవుతుందని పరిశోధనలో తేలినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: