టిక్ టాక్ మళ్లీ ఇండియాకు రానుందా..?

MOHAN BABU
టిక్ టాక్ గత ఏడాది ముందు భారతదేశం మొత్తం యువతతో పాటు అందరినీ ఆకట్టుకున్న అప్ అని చెప్పవచ్చు. దీని ప్రభావానికి గురై ఎంతోమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఇది కొంత మంది ప్రాణాలు తీసింది. కొంతమందికి జీవితాన్ని కూడా ఇచ్చింది. దీని ద్వారా తమ టాలెంట్ ను బయటపెట్టి ఎంతో మంది సెలబ్రిటీలు అయ్యారు. ఈ అప్ తో ఎంత లాభం ఉన్నదో అంతే నష్టం కూడా ఉన్నదని చెప్పవచ్చు.
 టిక్ టాక్ మళ్లీ ఇండియాలో కి రానున్నదని జోరుగా ప్రచారం కొనసాగుతోంది. భారతదేశంలో  తిరిగి తమ కార్యకలాపాలను ప్రారంభించే విషయమై భారత ఐటీ శాఖకు టిక్ టాక్  మాతృత్వ సంస్థ బైట్ డాన్స్  భారత ఐటీ మంత్రిత్వశాఖను సంప్రదించిందని సమాచారం. కేంద్రం కొత్త గా తీసుకొచ్చిన ఐ టి యొక్క నిబంధనలను పాటిస్తామని టిక్ టాక్ మరియు హలో యాప్లను పునరుద్ధరించాలని కోరినట్టు ది ప్రింట్ వెబ్సైట్ పేర్కొన్నది. టిక్ టాక్ కు భారత ప్రభుత్వం అనుమతిని మంజూరు చేస్తే  తిరిగి సేవలు ప్రారంభిస్తామని ఐటీ శాఖ అధికారులకు బైట్ డాన్స్ నిర్వాహకులు విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. యూజర్ ల డాటా విషయంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటామని, కొత్త నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తామని బైట్ డాన్స్ తెలిపినట్లు సమాచారం.
దేశ ప్రజల యొక్క భద్రత దృష్ట్యా గత ఏడాది మొత్తం 250 అప్లికేషన్లను భారత ప్రభుత్వం నిషేధించింది. ఇందులో అధికంగా చైనీస్ అప్స్ ఉన్నాయి. టిక్టాక్ నిషేధ సమయానికి భారత్ లో 20 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. టిక్ టాక్ ను నిషేధించిన తర్వాత అలాంటి అప్స్ చాలా వచ్చాయి. జోష్, మోజు, ఎమ్మెక్ టకటక్, చింగరి, జిలి, మిత్రన్, రొపొసొ, టికీ, స్నక్ వీడియో, ఇన్స్టా రిల్స్, యూట్యూబ్ షాట్స్ వంటి ఎన్నో అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ ఏవి కూడా టిక్ టాక్ అంతా ఆదరణ పొందలేకపోయాయని చెప్పవచ్చు. ఏది ఏమైనా  మళ్లీ టిక్ టాక్ వస్తే ఎంత మంది కళాకారులను చూడవలసి వస్తుందో వేచి చూడాల్సిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: