బుల్లిపిట్ట: ఈ మొబైల్స్ లో రెండు వాట్సప్ లు వాడుకోవచ్చని తెలుసా..

Divya

మనమందరం ఒకప్పుడు ఒక మొబైల్ లో ఒక వాట్స్ అప్ మాత్రమే ఉపయోగించుకునే సదుపాయం కలదు. కానీ టెక్నాలజీ మారుతున్న కొద్దీ కొత్తగా కనుక్కోవడం మొదలు పెట్టారు. ఆ తరువాత డ్యూయల్ సిమ్ సదుపాయాన్ని కల్పించే మొబైల్స్ వచ్చాయి. ఇక స్మార్ట్ ఫోన్స్ వచ్చాక అందరికీ అదే సదుపాయము అందుబాటులోకి వచ్చింది. అందులో రెండు మొబైల్ నెంబర్ల లాగే,ఇక పై ఒకే ఫోన్ లో  రెండు వాట్సప్ లను  రెండు విధాలుగా వాడుకోవచ్చు. అది ఎలానో చూద్దాం.

Xiaomi:
మీరు రెడ్మీ మొబైల్ వాడుతున్నట్లయితే. ముందుగా సెట్టింగ్ లోకి వెళ్లి ఓపెన్ చేయాలి. అక్కడ డ్యూయల్ యాప్ అనే ఆప్షన్ కనపడుతుంది. దానిమీద క్లిక్ చేయవలసి ఉంటుంది. అలా క్లిక్ చేసిన ఎడల అక్కడ వాట్స్అప్ సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే డబుల్ వాట్సాప్ వస్తుంది.
Realme:
రియల్ మీ మొబైల్స్ వాడేవారైతే ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేసి, అందులో యాప్ మేనేజ్ మెంట్ పై క్లిక్ చేసిన తర్వాత అక్కడ కనబడే వాట్సాప్ ని సెలెక్ట్ చేసుకోవాలి.

Samsung:
సాంసంగ్ మొబైల్ వాడేవారు. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత అడ్వాన్స్ ఫ్యూచర్ క్లిక్ చేయవలసి ఉంటుంది. అక్కడ డ్యూయల్ మెసెంజర్ తో ఒక ఫీచర్ ఉంటుంది.

Vivo:
వివో మొబైల్స్ వాడేవారు  సెట్టింగ్స్ పై క్లిక్ చేసిన తర్వాత నోటిఫికేషన్ సెక్షన్లో వాట్స్ అప్  పైన క్లిక్ చేయవలసి ఉంటుంది.

OPPO:
ఒప్పో మొబైల్ వాడేవారు సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత  యాప్ క్లోనర్ పైన క్లిక్ చేసి ఆ తర్వాత డబుల్స్ యాప్ క్రియేట్ చేసుకోవచ్చు.

ONEPLUS:
వన్ ప్లస్ మొబైల్స్ వాడేవారు, సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత యుటిలిటీస్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత అందులోని ప్యారలల్ యాప్స్ ను సెలెక్ట్ చేయవలసి ఉంటుంది.
HONOR:
హువాయి, హానర్ మొబైల్స్ వాడేవారు. సెట్టింగ్స్ ఓపెన్ చేసి యాప్ ట్విన్ పై క్లిక్ చేయవలసి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: