బుల్లి పిట్ట: అమ్మకాలలో దూసుకెళ్తున్న మారుతి సుజుకి..?

Divya

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో తనకు తిరుగు లేని పని ఏదీ లేదని నాలుగో సారీ మారుతి సుజుకి నిరూపించుకుంది. మరి ఏ కారును ప్రజలు ఎక్కువగా కొంటున్నారో తెలుసుకుందాం. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో ఎక్కువగా అమ్ముడుపోయిన కార్ల లో టాప్ ప్లేస్ లో నిలిచింది మారుతి సుజుకి. మారుతి సుజుకి లోనే స్విఫ్ట్ కారు  నే చాలా మంది ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. స్విఫ్ట్ అంటే ఓ పక్షి పేరు. దాని పేరు పెట్టుకున్న ఈ కారు కూడా అమ్మకాలలో వేగంగా దూసుకుపోతోంది..
వరుసగా నాలుగో సారి దేశంలోని మారుతి కార్లు సేల్స్ టాప్ లో నిలిచింది. మారుతి కంపెనీలలో మూడు రకాల కార్లు టాప్ లో నిలిచాయి.
1.స్విఫ్ట్ కారు ఏకంగా ఏడాదిలో 1.72 లక్షలు అమ్ముడు పోయాయట.
2.స్విఫ్ట్ తరువాత బాలెనో కారును ఎక్కువమంది కొనుక్కున్నారు. మొత్తం 1.63 లక్షల అమ్మకాలు జరిగాయి.
3.తర్వాత స్థానంలో వేగనార్ నిలిచింది. ఈ కారును ఈ ఏడాది కాలంలో 1.60 లక్షల మంది సొంతం చేసుకున్నారు.
4. ఇక అతి చిన్న కార్ ఏంటంటే మారుతి ఆల్టో.. ఇది నాలుగో స్థానంలో నిలిచింది. ఈ చిన్న కారును 1.59 లక్షల మంది కొన్నారు.
5.టాప్ ఫైవ్ లో డిజైర్ నిలిచింది. ఈ కారు ను మారుతి కంపెనీ ఎన్నో ఆశలు పెట్టుకుని,అందుకు తగ్గట్టుగానే డిజైర్1.28 లక్షల అమ్మకాలతో .. మారుతి రేంజ్ ను అమాంతం పెంచేసింది.

ఓవరాల్ గా చూస్తే, ఈ టాప్ 5 మోడల్స్  మొత్తం ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 30 శాతాన్ని ఆక్రమించాయి. గడిచిన 2017-18 సంవత్సరం నుంచి కూడా ఈ ఐదు మోడల్స్ ఇండియాలో  బాగా అమ్ముడుపోతున్నాయి.2020-2021 సంవత్సరంలో ఎక్కువగా మూడు పోయిన కార్లలో టాప్ 10 లో 7 కార్లు మారుతి సుజుకీవే కావడం విశేషం.. ఇతర కంపెనీల నుంచి పోటీ ఉన్నప్పటికీ.. మారుతి సుజుకి చెందిన 5 ప్యాసింజర్ కార్లు తొలి ఐదు స్థానాలు దక్కించుకోవడం గర్వంగా ఉందని, కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీవాస్తవ సత్తా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: