టీవీ: త్వరలో పెళ్లి పీటలెక్కనున్న శ్రీముఖి.. వరుడు ఎవరంటే..?
అంతేకాదు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ వరుస హాట్ గ్లామర్ ఫోటోషూట్లతో యువతకు నిద్రలేకుండా చేస్తోందని చెప్పాలి. ఒకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. మరొకవైపు బుల్లితెర షోలలో మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె సినిమాలలో హీరోలకు అక్క, చెల్లి పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటుంది. సినిమాలో చిరంజీవితో కలిసి నటించి మరింత క్రేజ్ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే బుల్లితెరపై యాంకర్ సుమ తర్వాత అంతటి క్రేజ్ దక్కించుకున్న శ్రీముఖికి సంబంధించిన పెళ్లి వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.
ఇంత వయసొచ్చినా ఇంకా వివాహం చేసుకోలేదు ఏంటి అంటూ అభిమానులు నెటిజన్లు అడుగుతూ ఉంటారు. అయితే ఇప్పటివరకు ఈ విషయాన్ని దాటవేస్తూ వచ్చింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే ఈ ముద్దుగుమ్మ వివాహం చేసుకోబోతోందట. అది కూడా పెద్దలు కుదుర్చిన వివాహం కాదు .. ప్రేమ వివాహం .. ఇన్ని రోజులు ఒక వ్యక్తిని చాలా గాఢంగా ప్రేమిస్తోందని అయితే ఈ విషయం ఎక్కడ బయటపడకుండా రహస్యంగా మెయింటైన్ చేసిందట శ్రీముఖి. ఇప్పుడు ఎట్టకేలకు కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు అని.. వెంటనే పెళ్లి చేసుకోమని తండ్రి చెప్పారట. శ్రీముఖి కూడా అంగీకరించిందని త్వరలోనే వీరి వివాహం జరగబోతుందని సమాచారం. ఇకపోతే శ్రీముఖి ప్రేమించిన ఆ వ్యక్తి ఎవరు అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఇక ఇందులో ఎంత నిజం ఉందో ఏమో కానీ ప్రస్తుతం ఈ వార్తలు మాత్రం చాలా వైరల్ గా మారుతున్నాయి.