టీవీ: అలాంటి మగాళ్లని చూస్తే పిచ్చెక్కుతుందంటున్న విష్ణు ప్రియ..!!

Divya
బుల్లితెరపై యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్యకాలంలో ఎలాంటి షో లు చేయకుండా కేవలం సోషల్ మీడియాలోనే బాగా పాపులారిటీ సంపాదించింది. ఇక అంతే కాకుండా ఈ మధ్య హీరోయిన్ గా కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా తన బాడీ ఫిట్నెస్ కోసం ఎప్పుడు కష్టపడుతూ ఉంటుంది విష్ణు ప్రియ. జిమ్ చేసేటువంటి వర్కౌట్ ఫోటోలను వీడియోలను అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు తన హాట్ వీడియోలను ఫోటోలను సైతం షేర్ చేస్తూ కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో గ్లామర్ డోర్స్ మరింత పెంచేసిందని చెప్పవచ్చు.

ఇక ఇలాంటి హాట్ షోలో వల్లే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా క్రేజీ సంపాదించింది. అందుచేతనే రెగ్యులర్గా తన ఫోటో షూట్లను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఎప్పుడూ అభిమానులతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా తమ జీవితంలో జరిగే కొన్ని విషయాలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది విష్ణు ప్రియ ఈ క్రమంలోని తన వివాహం గురించి స్పందించింది. తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం లేదట.

తనకి 30 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి మెచ్యూరిటీ వయసు వస్తుంది అప్పుడే వివాహం గురించి ఆలోచిస్తానని తెలియజేసింది. ఇక తనకు కాబోయే భర్త గురించి మాట్లాడుతూ దేవుడికి ఓపిక ఉన్నవాడు భర్తగా రావాలని.. అరబిక్ గాయ్ ఫేస్ కట్టు ఉండాలని. చాలా ఎత్తుగా ఉండాలని.. ఇలాంటి వారిని బయట చూసినప్పుడు తనకు చాలా పిచ్చెక్కిపోతుందని తెలియజేస్తోంది ఇలాంటివారు వచ్చి ప్రపోజ్ చేస్తే తప్పకుండా ఓకే చెబుతానని విష్ణు ప్రియ తెలియజేసినట్లు సమాచారం. ఈ విషయాలు విన్న అభిమానులు విష్ణు ప్రియ కోరికలు చాలానే ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: