టీవీ: బిగ్ బాస్ కంటెస్టెంట్ నాగవల్లి నెల సంపాదన తెలిస్తే షాక్..!!

Divya
ప్రస్తుతం సినీ సెలబ్రెటీలకు ఉన్నంత క్రేజ్ న్యూస్ రీడర్లకు కూడా బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు న్యూస్ రీడర్లను ఎక్కువగా పట్టించుకునేవారు కాదు. న్యూస్ రీడర్లు కూడా ప్రస్తుతం ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతూ ఉండడం వల్ల మంచి పాపులర్ సంపాదించుకున్నారు. ఇక అలాంటివారిలో దేవి నాగవల్లి కూడా ఒకరిని చెప్పవచ్చు. ఈమె ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో యాంకర్ గా కొనసాగుతూ ఉంది. ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా ఉండడం చేత ఈమెకు బిగ్ బాస్ లో కూడా అవకాశాన్ని అందుకుంది. ఇలా బిగ్ బాస్ ద్వారా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె సోషల్ మీడియాలో కూడా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
న్యూస్ యాంకర్ గా పేరు బాగానే సంపాదించుకున్నప్పటికీ తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటుంది. గత కొద్ది రోజుల క్రితం హీరో విశ్వక్ సేన్ పైన ఘాటు వ్యాఖ్యలు చేసి పలు వివాదాలలో చిక్కుకుంది. ఇలా తరచూ ఏదో ఒక విషయంలో ఈమె వైరల్ గా మారుతోంది. ఇక ఈమెకు వివాహం అయ్యి.. తన భర్తకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం తన కొడుకుతో ఒంటరిగా తన జీవితాన్ని గడుపుతోంది.
ఇలా ఈమె యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ.. ఇతర చానల్స్ సైతం ఈమెకు రెమ్యూనరేషన్ విషయంలో భారీ ఆఫర్లు ప్రకటించినప్పటికీ ఈమె తను చేస్తున్న చానల్స్ ని వదలకుండా అక్కడే కొనసాగుతూ ఉన్నది. ఇక ప్రస్తుతం ఉన్న న్యూస్ ఛానల్ లో యాంకర్ గా ఈమెకు నెలకు రూ.2.75 లక్షలకు  పైగానే రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. ఇది ఇవే కాకుండా ప్రత్యేకమైన కార్యక్రమాలకు ఈవెంట్లకు అదనపు రెమ్యూనరేషన్ కూడా అందుకుంటూ ఉంటుందట. దేవీ నాగవల్లి. ప్రస్తుతం ఈమె సోషల్ మీడియా ద్వారా కూడా పలు మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: