టీవీ: బిగ్ బాస్ లో అవకాశం వచ్చిన అందుకే వెళ్ళలేదు జబర్దస్త్ అప్పారావ్..!!

Divya
బుల్లితెరపై రియాలిటీ షోలో బిగ్ బాస్ షో కూడా ఒకటని చెప్పవచ్చు. ఎంతమంది ప్రేక్షకులు ఈ షోని చూస్తూ ఉన్నారు. బిగ్ బాస్ ప్రతి సీజన్ కూడా విజయవంతంగా కొనసాగింది. ఇక ప్రతి సీజన్లో కూడా జబర్దస్త్ కమెడియన్లకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయితే కొంతమంది కమెడియన్లు మాత్రం ఆఫర్ ని ఒప్పుకుంటే మరి కొంత మంది పెద్దగా ఆసక్తి చూపించలేదు. జబర్దస్త్ లో కామెడీ అనగా మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో అప్పారావు కూడా ఒకరు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన అప్పారావు పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. వాటి గురించి తెలుసుకుందాం.

అప్పారావు మాట్లాడుతూ.. నాగబాబు గారు వెళ్లిన సమయంలో జబర్దస్త్ రేటింగ్ బాగా తగ్గిపోయిందని.. ఆయన వెళ్లిపోవడంతో అందరం కూడా చాలా బాధపడ్డామని తెలియజేశారు అప్పారావు. అయితే రోజా గారు మాత్రం అందరిని చాలా సపోర్టు చేశారని తెలిపారు. నేను బిగ్ బాస్ షో కి వెళ్ళబోతున్నట్టుగా ప్రచారం ఎక్కువగా జరిగిందని తెలిపారు అప్పారావు. ముఖ్యంగా జబర్దస్త్ లో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు హ్యాపీగా ఉన్నామని తెలియజేశారు. ఎక్కడికి వెళ్లినా తనను పలకరించే వాళ్ళు.. ఎక్కువగా తన భార్యను కూడా అడుగుతారని తెలిపారు అప్పారావు.

అయితే బిగ్ బాస్ షోలో తనకి మూడుసార్లు అవకాశం వచ్చిందని అప్పారావు తెలియజేశారు. అయితే మల్లెమాలతో అగ్రిమెంట్ ఉండటం వల్ల నేను వెళ్లలేకపోయాను అని అప్పారావు తెలిపారు.. జబర్దస్త్ కళాకారుడుని బిగ్ బాస్ లోకి ఎటువంటి డబ్బులు తీసుకోకుండా పంపిస్తే జబర్దస్త్ కు వ్యాల్యూ ఉండదని  మల్లెమాల భావించిందని తెలిపారు అప్పారావు. జబర్దస్త్ నిర్వాహకులు మాత్రం డబ్బులు ఇవ్వలేకపోతే బిగ్ బాస్ కు వెళ్ళనివ్వమని తేల్చి చెప్పారని చెప్పాడు అప్పారావు. అయితే జబర్దస్త్ నిర్వాహకులు మాత్రం కమెడియన్లను గౌరవంగా బిగ్ బాస్ కు పంపించి ఉంటే అందరూ వేరే రకంగా ఉండేవారని అప్పారావు తన మనసులో మాటగా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: